కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో వర్చువల్ మోడ్ ద్వారా 14 నేషనల్ హైవే (ఎన్‌హెచ్) ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 765.663 కిలోమీటర్ల పొడవైన రోడ్లును రూ.13,169 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వీకే సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర, రాష్ట్ర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే:
- ఫోర్ లేనింగ్ ఆఫ్ యాదాద్రి – వరంగల్ – ఎన్‌హెచ్ 163
- నకిరేకల్ – తనంచెర్ల సెక్షన్ – ఎన్‌హెచ్ 365
- హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు – మెదక్ సెక్షన్ – ఎన్‌హెచ్-765D
- మన్నెగూడ – రావులపల్లి సెక్షన్ – ఎన్‌హెచ్ 163
- ఆత్మకూర్ - పరసా సెక్షన్ – ఎన్‌హెచ్ 163
- మహదేవ్పూర్ – భూపాలపల్లి సెక్షన్ – ఎన్‌హెచ్-353C
శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు ఇవే:
- ఫోర్ లేనింగ్ ఆఫ్ సూర్యాపేట – ఖమ్మం – ఎన్‌హెచ్ 65
- ఫోర్ లేనింగ్ ఆఫ్ మంచిర్యాల – రేపల్లెవాడ – ఎన్‌హెచ్ 363
- ఫోర్ లేనింగ్ ఆఫ్ రామ్సన్పల్లె – మంగళూరు – ఎన్‌హెచ్ 161
- ఫోర్ లేనింగ్ ఆఫ్ కంది – రామ్సన్పల్లె – ఎన్‌హెచ్ 161
- ఫోర్ లేనింగ్ ఆఫ్ మంగుళూరు – తెలంగాణ/మహారాష్ట్ర బోర్డర్
- ఫోర్ లేనింగ్ ఆఫ్ రేపల్లెవాడ – తెలంగాణ/మహారాష్ట్ర బోర్డర్ – ఎన్‌హెచ్ 363
- నకిరేకల్ – నాగార్జునసాగర్ సెక్షన్ బాలన్స్ వర్క్స్ – ఎన్‌హెచ్ 565
- నిర్మల్ – ఖానాపూర్ సెక్షన్ (వైడ్ నింగ్) – ఎన్‌హెచ్ 61
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ