ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరపలేరు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్పుపై జూ.ఎన్టీఆర్ స్పందన

Actor Junior NTR Respond on AP Government Decision to Name NTR Health University after YSR, NTR Jr Tweets About NTR Health University, NTR Jr About Change on NTR Health University, NTR Health University, Dr YSR Health Varsity, TDP Chief Chandrababu Naidu, AP Govt Decision to Name Change of NTR Health University After YSR, Mango News, Mango News Telugu, AP Former CM YS Rajashekar Reddy, Former CM Nandamuri Taraka Rama Rao, YSR Congress Party, Telugu Desham Party, AP Assembly Session

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం సభలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ట్విట్టర్ వేదికగా ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరని అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

“ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు” అని జూ.ఎన్టీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =