జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Government Approaches Supreme Court over GO Number 1,GO No.1 Regarding No Permission,For Road Shows and Rallies in AP,Chandrababu Fires on YCP Govt,Over GO No.1,No Permission For Road Shows,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates,Ap Bjp Party,Varahi Ready for Election Battle,Campaign Vehicle Varahi,Varahi Campaign Vehicle,Campaign Vehicle Varahi News and Live Updates,Nara Lokesh Padayatra,Lokesh Padayatra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను జనవరి 23వ తేదీ వరకూ సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఇటీవలే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ, తదుపరి విచారణ జనవరి 20వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జీవో నెంబర్ 1పై ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జీవో నెంబర్ 1పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ముందుగా జీవో నెంబర్ 1ను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, జనవరి 12న హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పిటీషనర్ తరపు న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం, జీవో 1ను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా రాష్ట్రంలోని జాతీయ, మున్సిపల్‌, పంచాయతీ రాజ్ రహదారులపై మరియు రోడ్డు మార్జిన్ల వద్ద సభలు, ర్యాలీల నిర్వహణను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ జీవోను వెంటనే రద్దు చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =