ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Extended His Greetings to All the Muslim Community on the Occasion of Eid Ul Fitr,Mango News,Mango News Telugu,Eid 2021,AP CM YS Jagan Greets Muslims of Telugu States,Eid 2021 News,Eid 2021 Wishes,AP CM YS Jagan Extended His Greetings To All The Muslim Community On Eid Ul Fitr,AP CM YS Jagan Extends Eid Greetings,CM YS Jagan Extends Eid Greetings,Eid Greetings From YS Jagan,CM YS Jagan Extends Eid Greetings to All the Muslim Community,CM greet Muslims on EID,Eid-ul-Fitr 2021,Jagan Greet Muslims,AP CM YS Jagan Extends Eid Greetings To Muslims,CM extend Ramzan greetings,YS Jagan Greets Muslims As Ramzan Commences

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్‌ ముబారక్‌) తెలిపారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా మహమ్మారి నుంచి బయట పడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు.

పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్ఠగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని సీఎం అన్నారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ, బీద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =