మహిళా ఉద్యోగులకు సోమవారం ఐచ్చిక సెలవు, ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Andhra Pradesh, Andhra Pradesh Government Holidays 2020, Andhra Pradesh News, AP Govt, AP Govt Declares October 26 as an Optional Holiday, General government holidays, Optional Holiday for Women Employees, Optional Holiday for Women Employees In AP

రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు అక్టోబర్ 26, సోమవారంను దసరా ఆప్షనల్‌ హాలిడే (ఐచ్చిక సెలవు) గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దసరా పండుగ ఆదివారం వచ్చిన నేపథ్యంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం సోమవారంను ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే గా ప్రకటించింది. అలాగే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కూడా సోమవారం నాడే దసరా సెలవుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పండుగ నేపథ్యంలో మహిళా ఉద్యోగుల కోరిక మేరకు ఏపీ ప్రభుత్వం కూడా సోమవారంను ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =