వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం..

AP Govt Invites Applications For YSR Lifetime Achievement and YSR Achievement 2023 Awards,AP Govt Invites Applications,Applications For YSR Lifetime Achievement,YSR Achievement 2023 Awards,YSR Lifetime Achievement,Mango News,Mango News Telugu, YSR Achievement 2023 prestigious awards, Andhra Pradesh, Public Relations, 31st of this month, YSR Achievement 2023 Awards Latest News, YSR Achievement 2023 Awards Latest Updates, YSR Achievement 2023 Awards Live News,AP Govt Latest News,AP Govt Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ 2023 అత్యున్నత పురస్కారాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దీనిపై సమాచార పౌరసంబంధాల శాఖ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల 31 వరకూ ఈ రెండు అవార్డులకు సంబంధించి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. అనంతరం వాటిని పరిశీలించి అవార్డులకు ఎంపికలు చేస్తారు.

ప్రజా సేవలో ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలు చేసిన సేవలకు గుర్తింపుగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ అవార్డులను అందజేస్తోంది. దరఖాస్తు చేసుకునే వ్యక్తులు, సంస్థలు తమ విజయాలు, సేవలు గురించి ఒక పేజీకి మించకుండా సమాచారాన్ని అందించాలని, వారి ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలు పొందుపరచాలని ప్రభుత్వం కోరుతోంది.

నామినేషన్స్‌పై ఎలాంటి పరిమితిలేకపోవడంతో పైన పేర్కొన్న రంగాల్లో ఎన్ని ఎంట్రీలైనా నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. నామినేషన్లు స్వీకరించడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2023గా పేర్కొంది. దరఖాస్తు చేసుకునే వ్యక్తులు, సంస్థలు తమ నామినేషన్లను మెయిల్ ఐడీకి కూడా పంపవచ్చని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారి దరఖాస్తులను పంపించేలా శాఖాధిపతులు మరియు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది.

అలాగే వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ 2023 అత్యున్నత పురస్కారాలకు అర్హతలు కూడా వెల్లడించింది. కళలు, సామాజిక సేవ, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సివిల్ సర్వీస్, స్పోర్ట్స్ మరియు తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పైన పేర్కొన్న రంగాల్లో గ్రామాల్లో, మురికివాడల్లో పనిచేస్తూ సరైన గుర్తింపు పొందని రాష్ట్రానికి చెందిన వ్యక్తులు, పొలిటికల్ ఎన్జీవోలు , స్వచ్ఛంద సేవా సంస్థలు..చరిత్రలో పేరుగాంచిన సంస్థలు, సంఘాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + nine =