సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఏం తేలబోతోంది?

CM YS Jagan Will Give Support For Minister Roja at Nagari Amid Local Politics,CM YS Jagan Will Give Support For Minister Roja,Minister Roja at Nagari Amid Local Politics,CM YS Jagan Amid Local Politics,Mango News,Mango News Telugu,Roja, Roja in Nagari, CM Jagan Mohan Reddy,Kodali Nani, Vamsi, Roja, Peddireddy, Jogi Ramesh, Dwarampudi, Ambati Rambabu, YCP,Minister Roja Latest News,Minister Roja Latest Updates,YSRCP Latest News,YSRCP Latest Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

వై నాట్ 175 అనేది ఏపీ సీఎం జగన్ ఎన్నికల నినాదం. ప్రతీ నియోజకవర్గంపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు అందుతున్న నివేదికలతో అలర్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో పార్టీ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అటు టీడీపీ, జనసేన మంత్రి రోజాను ఓడించాలనే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్ నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

మంత్రి ఆర్కే రోజా.. నగరిలో స్వపక్షం నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో రోజా వరుసగా నగరి నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రోజా 2,708 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గాలి బాను ప్రకాశ్‌పై గెలుపొందారు. జగన్ అధికారంలోకి రావటంతో రోజాకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ, తొలి విడతలో దక్కలేదు. రెండో విడత కేబినెట్‌లో రోజాకు మంత్రి పదవిపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు చివరికి మంత్రి పదవి దక్కింది. సీఎం జగన్‌కు మద్దతుగా నిలుస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌పై విరుచుకుపడే రోజాను టీడీపీ, జనసేన టార్గెట్ చేశాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి.

నగరిలో ప్రత్యర్థి పార్టీల ఎత్తుల కంటే సొంత పార్టీ నేతల నుంచే రోజా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తన ఇబ్బందులపై చాలా సందర్భాల్లో రోజా ఏకరువు పెట్టారు. నేరుగా సీఎం జగన్‌ను కలిసి తన నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారు. తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారి విషయంలో రోజా ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రోజా రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నా.. సొంత పార్టీలోని వ్యతిరేకులను మాత్రం తన వైపు తిప్పుకోవటంలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన వైసీపీలోని కొందరు నేతలను ఎలాగైనా ఓడించాలంటూ హిట్ లిస్ట్ సిద్ధం చేసుకున్నాయి. అందులో కొడాలి నాని, వంశీ, రోజా, పెద్దిరెడ్డి, జోగి రమేశ్, ద్వారంపూడి, అంబటి రాంబాబు వంటి వారు ఉన్నారు.

ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేస్తున్న మంత్రి రోజాను గెలిపించుకోవటం ఇప్పుడు సీఎం జగన్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అయితే, నగరిలో మాత్రం భిన్న రాజకీయం నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీ నేతల విషయంలో సీఎం జగన్ ఏం తేల్చబోతున్నారనేది ఆసక్తిని పెంచుతోంది. కీలకమైన ఎన్నికల వేళ సీఎం జగన్ ఈరోజు నగరి పర్యటనకు వస్తున్నారు. విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో నగరి అభ్యర్థిగా రోజా గెలుపు బాధ్యతలపై సీఎం ప్రస్తావించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగరిలో తాజా పరిస్థితులపైన లేటెస్ట్ రిపోర్ట్స్‌తో పూర్తి అంచనాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ తన నగరి పర్యటనలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =