ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు.. ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం

AP Govt Issues GO Regarding PRC Implementation For APSRTC Employees From Jan 1st 2020, YSRCP Govt Issues GO Regarding PRC Implementation For APSRTC Employees From Jan 1st 2020, Govt Issues GO Regarding PRC Implementation For APSRTC Employees From Jan 1st 2020, AP Govt Issues GO Regarding PRC Implementation For APSRTC Employees, PRC Implementation For APSRTC Employees, APSRTC Employees, PRC Implementation, GO Regarding PRC Implementation, New GO Regarding PRC Implementation, New GO Regarding PRC Implementation APSRTC Employees, AP Govt Issues New GO, New GO For PRC, New GO, APSRTC, Mango News, Mango News Telugu,

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ‘పీఆర్సీ’ అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ లభించనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తద్వారా 11వ పీఆర్సీ అమలుకు సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేసే విధానంపై స్పష్టతనిచ్చింది. ఉద్యోగుల పేస్కేల్, అలవెన్సులు వంటి అంశాలకు సంబంధించి జీవోలో స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జూలై 1నుంచి కొత్త పీఆర్సీ విధానం అమలులోకి వచ్చింది. 2020 జనవరి 1నుంచి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

దీంతో ఆర్టీసీ ఉద్యోగులు పీటీడీ ఉద్యోగులుగా విలీనం అయ్యారు. వీరికి ఆర్టీసీలో ఉన్నప్పుడు 2017 ఏప్రిల్ 1నుంచి వేతన సవరణ అమలు చేశారు. కాగా తాజా జీవో ప్రకారం ప్రభుత్వంలో విలీనమైన 2020 జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు కానుంది. దీని ప్రకారం 23 శాతం ఫిట్‌మెంట్, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ (సిటీ కాంపన్సేటరీ అలవెన్స్‌), పెన్షన్, గ్రాట్యుటీ ఇతర రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వంటి అంశాలకు సంబంధించి ఎలా వర్తింపజేయాలో జీవోలో స్పష్టం చేసింది. అలాగే ట్రావెలింగ్‌ ఇతర అలవెన్సులకు సంబంధించి మరో జీవో ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − two =