సంబంధం ఉన్న ఎవరినీ విడిచిపెట్టవద్దు, హైద‌రాబాద్‌లో బాలిక ఘ‌ట‌న‌పై మంత్రి కేటీఆర్ సీరియ‌స్‌

Minister KTR Responds over Hyderabad Minor Girl Molestation Incident, KTR Responds over Hyderabad Minor Girl Molestation Incident, Telangana Minister KTR Responds over Hyderabad Minor Girl Molestation Incident, Hyderabad Minor Girl Molestation Incident, Hyderabad Minor Gang Rape Case Police Arrests 2 Accused Amongst Five Including 3 Minor, Police Arrests 2 Accused Amongst Five Including 3 Minor, Hyderabad Minor Gang Rape Case, Hyderabad Minor Gang Rape Case Police Arrests 2 Accused, 3 Minor, Hyderabad Minor Girl Molestation Case West Zone DCP Press Meet on Accused Detain and Case Details, Minor Girl Molestation Case West Zone DCP Press Meet on Accused Detain and Case Details, West Zone DCP Press Meet on Accused Detain and Case Details, Hyderabad Minor Girl Molestation Case, Minor Girl Molestation Case, Hyderabad Teen Gang Raped In Mercedes By 5 Minors Including MLAs Son, an incident of gang rape was reported on the 3rd of June, Hyderabad’s Jubilee Hills, 17-year-old victim said That she was attacked by five minors who molested and gang-raped her in a Mercedes car, Mercedes car, gang-raped, 17-year-old Teen, 5 Minors, Hyderabad minor gang-raped in car, Hyderabad teen gang-raped in car, Hyderabad minor allegedly raped in Mercedes car, a minor girl was allegedly molested and gang-raped in a Mercedes car, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఎవరినీ విడిచిపెట్టవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ హైదరాబాద్‌ లో మైనర్‌పై అత్యాచారం జరిగిందన్న వార్తతో ఆగ్రహం, దిగ్భ్రాంతి కలిగింది. ఈ ఘటనపై తక్షణ మరియు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ను కోరారు. ఈ ఘటనకు పాల్పడ్డ వారు ఎవరైనాసరే దయచేసి వారి హోదాలు లేదా అనుబంధాలతో సంబంధం లేకుండా ప్రమేయం ఉన్న వారిని విడిచిపెట్టవద్దని మంత్రి కేటీఆర్ సూచించారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్ పై హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందిస్తూ, నేరస్తులందరిపై వారి నేపథ్యంతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది దారుణమైన సంఘటన అని, ఇప్పటికే చర్యలు తీసుకోవాలని, నిందితులందరినీ వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని, హైదరాబాద్‌ సీపీకి ఆదేశాలు ఇచ్చినట్టు హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు.

ముందుగా మే28న జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలికను ఇంటి వద్ద దింపుతామని ఐదుగురు యువకులు తమ కారులో ఎక్కించుకొని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మే 31న బాలిక తండ్రి ఫిర్యాదు మేర‌కు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్‌ 354, పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు అయింది. ఈ కేసును హైదరాబాద్ పోలీసులు త్వరితగతిన దర్యాప్తు జరుపుతున్నారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి సాదుద్దీన్‌ మాలిక్‌ అనే నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. జువైనల్‌ అయిన మరో నిందితుడుని కూడా గుర్తించామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీని ప్రకారం ఐదుగురు నిందితులను గుర్తించామని, ఇందులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. మరో 48 గంటల్లో మిగతా నిందితులను కూడా అరెస్టు చేస్తామని డీసీపీ జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =