ఏపీలో నేటినుంచి ఆత్మకూరు ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

AP The Nominations Process For Atmakur By-Election Starts From Today, Nominations Process For Atmakur By-Election Starts From Today, Atmakur By-Election Starts From Today, Atmakur By-Election, Election Commission has issued the notification for conduct of by-election to the Atmakur Assembly Constituency, Atmakur Assembly Constituency, Election Commission, Atmakur assembly byelection to be held on June 23, Byelection to the Atmakur assembly constituency in Nellore district, Election Commission of India, Byelection in Atmakur, Atmakur By-Election Nominations Process, Atmakur Bypoll On June 23, Atmakur By-Election News, Atmakur By-Election Latest News, Atmakur By-Election Latest Updates, Atmakur By-Election Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించిన నామినేష్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. మే 25వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్‌ మేరకు ఈ రోజు నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల అధికారిగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరేంద్రియ ప్రసాద్‌ను నియమించారు. కాగా 2019లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి గెలుపొందారు. అయితే ఫిబ్రవరిలో ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో ఆత్మకూరు స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉపఎన్నికకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున గౌతంరెడ్డి తమ్ముడు మేకపాటి విక్రమ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మరోవైపు బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించనున్నట్లు తెలిపింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని, అభ్యర్థిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరియు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే ప్రకటించారు.

ఉపఎన్నిక షెడ్యూల్
  • నామినేషన్‌ దాఖలుకు చివరి తేది – జూన్‌ 6
  • నామినేషన్ల పరిశీలనకు చివరి తేది – జూన్‌ 7
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది – జూన్‌ 9
  • పోలింగ్ జరుగు తేదీ – జూన్‌ 23
  • ఉపఎన్నిక ఫలితాలు వెలువడే తేదీ – జూన్‌ 26

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =