సినిమా టిక్కెట్ల విషయంలో త్వరలో మంత్రి పేర్ని నానిని కలువనున్న రాంగోపాల్ వర్మ

Mango News Telugu,andhra pradesh, Andhra Pradesh Ticket Issues, Andhra Pradesh Tollywood Ram Gopal Varma To Meet Minister Perni Nani Over Movie Ticket Issue, AP Minister, Ap movie tickets issue, Cinema Ticket Issue, CM YS Jagan Mohan Reddy, Director RGV, Jagan Mohan Reddy, Mango News, Minister Perni Nani, Minister Perni Nani Invites RGV For A Meeting, Movie News, Movie Ticket Issue, movie tickets, movie tickets issue in ap, Movie Updates, Perni Nani, ram gopal varma, Ticket Price issue, Tollywood Live Updates, Tollywood News, Tollywood Ram Gopal Varma, Tollywood Ram Gopal Varma To Meet Minister Perni Nani Over Movie Ticket Issue

ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. అటు ఏపీ ప్రభుత్వానికి.. ఇటు ఇండస్ట్రీకి మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరట్లేదు. ఇప్పటికే, కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, వారిపీ ఏపీ మంత్రులు రివర్స్ కామెంట్స్ చేయడంతో దుమారం రేగింది. ఈ తరుణంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంటరవడం ఎవరూ ఊహించని పరిణామం. టికెట్ల ధరలపై ఆయన ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు.

గత కొద్ది రోజులుగా.. ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలనే డిమాండ్‌కు సపోర్ట్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్స్ పెడుతున్నారు. ఈ అంశంపై వివిధ న్యూస్ ఛానల్ డిబేట్లలో పాల్గొని తన వైఖరిని తెలియజేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంలో ఆర్జీవీకి సపోర్టుగా నిలిచారు. అయితే, వర్మ చేసిన కొన్ని ట్వీట్లపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు. సినిమా పరిశ్రమలోని సమస్యలపై చర్చకు సమయం కేటాయించాలని మంత్రిని ఆర్జీవీ కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. జనవరి 10 మధ్యాహ్నం ఆర్జీవీకి మంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అమరావతిలోని సచివాలయంలో వీరద్దరి భేటీ జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 7 =