సీఎం జగన్ కీలక నిర్ణయం.. హోంగార్డులకు కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్

CM Jagan Gives Green Signal To Reservations For The Home Guards in Constable Posts,CM Jagan's Key Decision,Green Signal For Reservations, Reservations In Constable Posts,Reservations In Home Guards Posts,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లోని హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా వారికి కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్), ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుల్ పోస్టులలో రిజర్వేషన్లు కల్పించారు. అలాగే వీటితో పాటు పొలీసు శాఖలోని కమ్యూనికేషన్స్, ఫిట్టర్-ఎలక్ట్రీషియన్, మెకానిక్స్ మరియు డ్రైవర్ వంటి పోస్టుల్లో కూడా హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ మేరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడానికి ఏపీ పొలీసు నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలను సవరించడం విశేషం. సీఎం జగన్ సూచనల మేరకు రాష్ట్ర హోంశాఖ ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్స్ 1999’ చట్టానికి సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే వీటిలో సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళలు, పురుషులు ఇద్దరికీ రిజర్వేషన్లు వర్తింపజేస్తుండగా.. ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్-ఎలక్ట్రీషియన్, మెకానిక్స్ మరియు డ్రైవర్ పోస్టులలో కేవలం పురుషులకు మాత్రమే అవకాశం అందించారు. ఈ విభాగాల్లో కేటగిరీల వారీగా 5శాతం నుంచి 25శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా దాదాపు 15వేల మందికి ప్రయోజనం కలుగనుంది. కాగా ఇటీవలే సీఎం జగన్ రాష్ట్రంలో 6,511 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలివ్వడం తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హోంగార్డులకు పోస్టుల వారీగా రిజర్వేషన్ శాతం..

  • ఫిట్టర్-ఎలక్ట్రీషియన్ పోస్టులకు – 5%
  • మెకానిక్స్ పోస్టులకు – 10%
  • కమ్యూనికేషన్స్ పోస్టులకు – 10%
  • సివిల్ పోస్టులకు – 15%
  • ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోస్టులకు – 15%
  • డ్రైవర్ పోస్టులకు – 20%
  • ఏపీఎస్పీ పోస్టులకు – 25%
  • ఎస్ఏఆర్ సీపీఎల్ పోస్టులకు – 25%

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 3 =