పెన్షన్లు ఎంత సమర్థవంతంగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అలాగే చేయాలి – సీఎం జగన్

CM Jagan Held Review Meet on Women and Development of Child Welfare Department Today at Tadepalli Camp Office,CM Jagan Held Review Meet on Women and Development,Child Welfare Department,CM Jagan Today at Tadepalli Camp Office,Mango News,Mango News Telugu,YS Jagan reviews on Women and Child Welfare Dept,CM YS Jagan holds review meeting,AP CM YS Jagan Mohan Reddy,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లు ఎంత సమర్థవంతంగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అలాగే చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమంపై సమీక్ష సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్, శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయ సునీత సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలోని అంగన్‌వాడీలలో నాడు – నేడు పనులపై కూడా సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం, అంగన్‌వాడీలపై సమీక్షలో భాగంగా సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • ఫౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా మారిన 10 వేలకు పైగా అంగన్‌వాడీల్లో పనులపై అధికారులు వివరణపై సంతృప్తి వ్యక్తం.
  • అలాగే 45వేల అంగన్‌వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలి.
  • అంగన్‌వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలి.
  • ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు తదితర సౌకర్యాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి.
  • ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి ఎప్పటికప్పుడు తనకు నివేదికలు ఇవ్వాలి.
  • పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలి.
  • గ్రోత్‌ మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి.
  • ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
  • అలాగే మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా పూరించాలి.
  • సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలి.
  • పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలి.
  • ఇక అంగన్‌వాడీల్లో సూపర్‌ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =