175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా? – టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి సీఎం జగన్ సవాల్

CM Jagan Released of Rs. 231 Cr Funds To 123519 Beneficiaries Under YSR Matsyakara Bharosa in Nizampatnam Bapatla,CM Jagan Released of Rs. 231 Cr,CM Jagan Released of Rs. 231 Cr Funds,CM Jagan Released YSR Matsyakara Bharosa Funds,YSR Matsyakara Bharosa in Nizampatnam Bapatla,Mango News,Mango News Telugu,YSR Matsyakara Bharosa 2023,YSR Matsyakara Bharosa Latest News And Updates,CM Jagan To Distribute YSR Matsyakara Bharosa,CM Jagan To Distribute YSR Matsyakara Bharosa,CM Jagan Latest News And Updates,Matsyakara Bharsa Scheme,Matsyakara Bharosa Scheme For Fishermen,Matsyakara Bharosa Scheme Latest News And Updtes,YSR Matsyakara Bharosa in Nizampatnam Bapatla

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా? అని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద మొత్తం రూ.231 కోట్ల నగదును బటన్ నొక్కడం ద్వారా నేరుగా 1,23,519 మత్స్యకార కుటుంబాల లబ్ధిదారులకు, ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున ఖాతాల్లోకి జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమానికి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమానికి తేడా గమనించాలని లబ్ధిదారులతో పాటు ప్రజలను కోరారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇరువురిపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు..

  • గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు కేవలం రూ.4వేలు సాయం అందించారు.
  • చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో రూ.104 కోట్లు ఇస్తే.. వైసీపీ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.104 కోట్లు ఇచ్చింది.
  • నాడు కేవలం 1,100 బోట్లకు సబ్సిడీ ఇస్తే.. నేడు 20,000 బోట్లకు అందిస్తున్నాం.
  • అలాగే గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ప్రస్తుతం రూ.9 చెల్లిస్తున్నాం.
  • మేం చేస్తున్న మంచి పనులను చూసి ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారు.
  • చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతిలో.. అధికారం పోతే జూబ్లీహిల్స్‌లో ఉంటారు.
  • కానీ నేను మాత్రం ఏపీలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నాను, తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నా.
  • చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదు, వెన్నుపోటు ఒక్కటే గుర్తొస్తుంది.
  • ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తుకొస్తారు.
  • గతంలో కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకునే వారికి ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా?
  • వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా?
  • చంద్రబాబు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ పడగలరా?
  • రాష్ట్రం కోసం ప్రధాని మోదీని కలిసినా దుష్ప్రచారం చేస్తున్నారు.
  • బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో తిరిగిన వాళ్ళే నాపై విమర్శలు చేస్తున్నారు.
  • ఒకసారి పొత్తు పెట్టుకుంటారు.. మరోసారి విడిపోతారు, ఇలాంటి వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు.
  • ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎంతమంది కలిసి వచ్చినా ఒంటరిగానే ఎదుర్కొంటా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =