తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

CM YS Jagan Greets Tamil Nadu Chief Minister MK Stalin on His Birthday Today,CM YS Jagan Greets Tamil Nadu CM,YS Jagan Greets MK Stalin,Chief Minister MK Stalin Birthday Today,Mango News, Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu,Janasena Chief Pawan Kalyan,AP Bjp Chief Somu Verraju,YSR Congress Party,Telugu Desam Party,Janasena Party,BJP Party,YSR Party,TDP Party,JSP Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates, Andhra Pradesh Latest Investments, Andhra pradesh Politics,AP Governer,AP Cabinet Minister,AP Ministers,Andhra Pradesh Welfare Schemes,AP CM Jagan Latest News and Live Updates

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ తన ట్విటర్‌ ద్వారా స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాగా స్టాలిన్‌ ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకోనుండటం విశేషం. దీంతో సీఎం జగన్ దీనిని గురించి ట్వీట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంకే స్టాలిన్‌ గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీకు మంచి ఆరోగ్యం, సంతోషం మరియు విజయాన్ని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

ఇక సీఎం స్టాలిన్‌ జన్మదినం సందర్భంగా.. ఈరోజు ఉదయం మెరీనా బీచ్‌ ఒడ్డున ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఎం కరుణానిధి, సిఎన్‌ అన్నాదురైల సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అలాగే ప్రముఖ తమిళ సంస్కరణవాద నాయకుడు పెరియార్‌ ఈవీ రామసామి స్మారకాన్ని సందర్శించి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఇక తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును పురస్కరించుకుని అధికార డీఎంకే పార్టీ మద్దతుదారులు తమిళనాడు అంతటా ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 20 =