తెలంగాణలో ఐసెట్-2023 ప్రవేశ పరీక్షషెడ్యూల్ విడుదల

Telangana ICET 2023 Schedule Released Entrance Exam held on May 26 27th, Telangana ICET 2023,Telangana ICET Schedule Released,ICET Entrance Exam on May 26th And May 27th,Mango News,Mango News Telugu,Tspsc Group 4 Apply Online,Tspsc Group 4,Tspsc Group 2 Notification,Tspsc Group 2,Tspsc Group 1 Notification,Tspsc Group 1,Tspsc,Telangana State Government Jobs Notification 2023,Telangana State Government Jobs Notification,Telangana State Government Jobs 2023,Telangana State Government Jobs,Telangana Latest Government Jobs,Telangana Jobs,Telangana Group Exams 2023,Telangana Group Exams,Telangana Government Jobs Official Website,Telangana Government Jobs Notification,Telangana Government Jobs Apply Online,Telangana Government Jobs 2023

తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే టీఎస్ ఐసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. 2023 సంవత్సరానికి గానూ ఐసెట్ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మ‌న్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కాకతీయ యూనివ‌ర్సిటీ వీసీ టీ.రమేశ్, క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ పీ.వ‌ర‌ల‌క్ష్మితో కలిసి ఐసెట్-2023 షెడ్యూల్ ను విడుదల చేశారు. ఐసెట్‌-2023 ప్రవేశ పరీక్ష కోసం మార్చి 6 నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఆలస్య రుసుము లేకుండా మే 6 వరకు స్వీకరించనున్నారు. మే 26, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఐసెట్‌ పరీక్షను 14 రీజియన్ సెంటర్లలో 75 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు.

టీఎస్ ఐసెట్-2023 పరీక్షషెడ్యూల్:

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 6
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : మే 6
  • ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 12
  • ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 18
  • సబ్మిట్ చేసిన దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం: మే 12 నుంచి మే 18 వరకు
  • హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : మే 22నుండి
  • ఐసెట్-2023 పరీక్ష నిర్వహణ తేదీలు : మే 26, 27
  • ప్రిలిమినరీ కీ ప్రకటన : జూన్ 5
  • ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను సమర్పించడానికి చివరి తేదీ: జూన్ 8 (సాయంత్రం 5 గంటలకు).
  • ఐసెట్-2023 ఫైనల్ కీ, ఫలితాల విడుదల: జూన్ 20.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 4 =