ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 12,092 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 46 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా గుంటూరులో 11, విశాఖపట్నంలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 5, తూర్పుగోదావరిలో 5, అనంతపురంలో 5 నమోదయ్యాయి. కర్నూల్, శ్రీకాకుళం, కృష్ణా వంటి 3 జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,751 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,729 గా ఉంది. గత 24 గంటల్లో 134 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 23,03,361కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 661 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,32,37,304 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ