పంజాబ్‌లో విజయం సాధించిన ‘ఆప్‌’కి ప్రధాని మోదీ అభినందనలు, థాంక్స్ చెప్పిన కేజ్రీవాల్

PM Modi Congratulates AAP For Historic Win in Punjab Kejriwal Reply With Thanks, PM Modi Congratulates AAP For Historic Win in Punjab Elections, PM Modi Congratulates AAP For Historic Win, Punjab Elections, AAP Candidate In Patiala Urban, Punjab Assembly Elections Results 2022, Aam Aadmi Party Sweeps Punjab Assembly Elections by Winning 92 Seats, Punjab Election 2022 Results Updates AAP Party Lead In Punjab, Punjab Election 2022 Results Updates, AAP Party Lead In Punjab Election 2022, Punjab Assembly Elections-2022 Results Updates, Punjab Assembly Elections-2022 Results Updates AAP Party Lead In Punjab, Punjab Assembly Elections-2022, Assembly election 2022 live updates, Assembly election 2022 Latest updates, Assembly election 2022 Latest News, Punjab Election 2022, 2022 Punjab Election, Punjab, Punjab Assembly Elections 2022, 2022 Punjab Assembly Elections, Punjab Assembly Elections, Punjab Assembly Elections Latest News, Punjab Assembly Elections Latest Updates, Punjab Assembly Elections Live Updates, 2022 Assembly Elections, Assembly Elections, Elections, Mango News, Aam Aadmi Party Sweeps Punjab Assembly Elections,

పంజాబ్‌లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఆప్‌ని ప్రధాని మోదీ అభినందించారు. ‘పంజాబ్ ఎన్నికలలో ఆప్ విజయం సాధించినందుకు అభినందనలు. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బదులిస్తూ.. థాంక్యూ (ధన్యవాదాలు) సార్ అని ట్వీట్ చేశారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం తాజాగా వచ్చిన ఫలితాల అనంతరం పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ మరియు SAD-BSP కూటమిని చిత్తు చేయడం ద్వారా మొత్తం 117 సీట్లలో రికార్డు స్థాయిలో 92 స్థానాలను కైవసం చేసుకుంది.

60 ఏళ్ల తర్వాత పంజాబ్‌లో ఆప్‌ కొత్త రికార్డును తిరగరాసింది. 1962 తర్వాత పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ పొత్తు లేకుండా 92 సీట్లు గెలవడం విశేషం. ఆప్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ అద్భుత విజయం సాధించారు. భగవంత్ మాన్ సంగ్రూర్ జిల్లా ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58,206 ఓట్ల తేడాతో గెలుపొందారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నవాన్‌షహర్ జిల్లాలోని ఖట్కర్‌కలన్‌లో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ దిగ్గజాలుగా పేరుపొందిన ప్రముఖులు ప్రకాష్ సింగ్ బాదల్ మరియు అమరీందర్ సింగ్‌లు ఆప్ ధాటికి ఓటమి చెందారు. అలాగే, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూతో సహా ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ పోటీచేసిన రెండు స్థానాలలో పరాజయం పాలయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =