సీపీఎం పార్టీ సీనియర్‌ నేత రాఘవులు సంచలన నిర్ణయం.. ప్రాథమిక సభ్యత్వం మినహా పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా

CPM Senior Leader BV Raghavulu Resigns For All Posts Including Party Politburo Except Primary Membership,CPM Senior Leader BV Raghavulu Resigns,BV Raghavulu Resigns For All Posts Including Party Politburo,Except Primary Membership For All Posts Raghavulu Resigns,Mango News,Mango News Telugu,CPM Senior Leader BV Raghavulu,CPM Politburo Member BV Raghavulu Questions,BV Raghavulu Latest News,BV Raghavulu Latest Updates,CPM Senior Leader BV Raghavulu News

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ – సీపీఎం) పార్టీ సీనియర్‌ నేత బివి రాఘవులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసారు. సీపీఎం అనుబంధ విద్యార్ధి సంఘం ఎస్‌ఎఫ్ఐ లో పని చేస్తూ కిందిస్థాయి నుంచి ఎదిగిన రాఘవులు అనంతరం పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన సంగతి తెలిసిందే. కాగా సీపీఎం సంస్థాగత నిర్మాణంలో బివి రాఘవులు కీలకంగా వ్యవహరించారు. అలాగే జాతీయ స్థాయిలోనూ పార్టీలో రాఘవులకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదుల పరిణామాల నేపథ్యంలోనే రాఘవులు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయితే రాఘవులు రాజీనామా వెనక్కి తీసుకోవాలని సీపీఎం అగ్రనేతలు కోరుతున్నారు. కానీ తన నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని, పార్టీలో సాధారణ కార్యకర్తగా క్షేత్రస్థాయిలో పనిచేస్తానని రాఘువులు వారికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా రాఘవులు రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఇప్పటివరకూ ఆమోదించలేదని సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =