లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు, ప్రకటించిన లోక్‌సభ సెక్రటేరియట్

Congress Leader Rahul Gandhi Disqualified as a Member of Lok Sabha Lok Sabha Secretariat Issues Notification,Congress Leader Rahul Gandhi Disqualified,Rahul Gandhi Disqualified as a Member of Lok Sabha,Lok Sabha Secretariat Issues Notification,Mango News,Mango News Telugu,Rahul Gandhi disqualified as Lok Sabha member,Senior Congress leaders to meet today at party office,Rahul Gandhi disqualified as MP,Rahul Gandhi Live Updates,Congress Leader Rahul Gandhi Latest News

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ప్రధాని మోదీ ఇంటి పేరును కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై కేసు నమోదు కాగా, ఈ కేసును విచారించిన అనంతరం గుజరాత్ లోని సూరత్‌ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషిగా తేలడం, 2 ఏళ్ల శిక్ష పడిన నేపథ్యంలో లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది.

“నెం.21/4(3)/2023/TO(B) C.C./18712/2019లో సూరత్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారించిన తర్వాత, కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8తో పాటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం 2023 మార్చి 23న దోషిగా నిర్ధారించబడిన తేదీ నుండి లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు” అని లోక్‌సభ సెక్రటేరియట్ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 16 =