బాలయ్య భార్య వసుంధర సెంటిమెంట్‌.. చాలామందికి వర్కవుట్ అయిందట..

Do You Know About The Golden Hand of Tollywood Actor Nandamuri Balakrishnas Wife Vasundhara,Do You Know About The Golden Hand,The Golden Hand of Tollywood,Golden Hand of Tollywood Actor Nandamuri Balakrishnas Wife,Golden Hand of Tollywood Vasundhara,Mango News,Mango News Telugu,Vasundhara, Balayya's wife Vasundhara, Balayya, Vasundhara sentiment, Vasundhara Lucky Hand,Golden Hand of Tollywood,Actor Nandamuri Balakrishnas Wife,Tollywood Actor Nandamuri Balakrishnas News,Nandamuri Balakrishnas Wife News Today

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి, బాబీ దర్శకత్వంలో మరో సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నారు. విజయవంతమైన కాంబినేషన్‌గా ఇండస్ట్రీలో పేరున్న వీరిద్దరి సినిమాకు నిర్మాతగా ఉండేందుకు పలువురు పోటీపడుతున్నారు. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో మంచి ఊపుమీదున్న బాలయ్య క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.అయితే ఇండస్ట్రీలో బాలయ్యకు ఎంత పేరుందో.. అలాగే బాలకృష్ణకు ఎంత పేరుందో.. ఆయన వసుంధరకు అంత పేరే ఉందంట. కానీ ఈ విషయం బయట జనాలకు పెద్దగా తెలియదు.

నందమూరి బాలకృష్ణ భార్య వసుంధరది చాలా లక్కీ హ్యాండ్ అని తెలుగు సినీ పరిశ్రమలో టాక్ ఉంది. ఆమె చేత్తో ఇచ్చిన డబ్బులతో ఏ పని మొదలుపెట్టినా మంచి జరుగుతుందని పరిశ్రమలో చాలామంది భావిస్తారు. ఆమె చేతి నుంచి డబ్బులు తీసుకుంటే పంట పండినట్లే.. అని, ఆమెది గోల్డెన్ హ్యాండ్ అని చర్చ జరుగుతుంటుంది. అలాగే తమ పిల్లల్ని కూడా ఎటువంటి వివాదాలకు తావివ్వనిరీతిలో పెంచారు. ఆ కోణంలో కూడా వసుంధరను అభిమానించేవారు ఎక్కువగా ఉంటారు.

బాలకృష్ణతో సినిమాలు తీసే నిర్మాతల్లో చాలామంది వసుంధర చేతులమీదగా డబ్బులు తీసుకొని మొదలు పెడతారు. ఇలా చేయడంవల్ల ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతారు. ఇక గతంతో పోలిస్తే బాలకృష్ణ క్రేజ్ ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతోంది. అన్‌స్టాపబుల్ షో చేయడం కూడా ఆయనకు ప్లాస్ పాయింట్ అయింది. ఆ షో నుంచే ఈ జనరేషన్ యువత కూడా ఆయనకు అభిమానులైపోతున్నారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఎటువంటి తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. బీ గోపాల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో త్వరలోనే మరో సినిమా తెరకెక్కబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here