ఇండియన్‌ రైల్వే సరికొత్త ఆలోచన.. త్వరలోనే ట్రయల్ రన్

Indian Railways Plans Double Decker Trains For Cargo-Cum-Passengers at The Same Time,Indian Railways Plans Double Decker Trains,Double Decker Trains For Cargo Cum Passengers,Cargo Cum Passengers at The Same Time,Mango News,Mango News Telugu,Cargo Cum Passengers,Railways plans double decker trains,Indian Railways,Indian Railway's,Indian Railway's new idea, trial run soon, 2 in 1 trains,Passengers and cargo simultaneously,Double Decker Trains Latest News,Indian Railways Latest News,Indian Railways Latest Updates,Indian Railways Live Updates

మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే.. ప్రయాణికుల అభిరుచులు తెలుసుకుంటూ వారికి కావల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటూ తాను కూడా మార్పులు చేసుకుంటూ వస్తుంది. సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా గూడ్స్ రైళ్లు నడుస్తుంటాయి. ప్రయాణికులను చేరవేయడానికి ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.

కరోనా సమయంలో రైల్వేలకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. ప్రయాణికులతోపాటు సరుకు రవాణాను కూడా ఏకకాలంలో నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. డబుల్ డెక్కర్ రైళ్లను తయారుచేసి అందులోని పైభాగంలో 46 మంది ప్రయాణికులు, కింద భాగంలో సరుకు రవాణా జరిగేలా యోచిస్తున్నారు. కపుర్తలాలోని ఐసీఎఫ్‌లో ఈ తరహా రైలు తయారవుతోంది.

బెల్లీ ఫ్రైట్ కాన్సెప్ట్‌తో ఇవి నడవనున్నాయి. వీటి ట్రయల్ రన్ ఈ నెలాఖరులోపు జరగనుంది. మొదట్లో రెండు డబుల్ డెక్కర్లను రూపొందిస్తారు. ఎగువ కంపార్ట్‌మెంట్‌లో 46 మంది ప్రయాణికులు, దిగువ కంపార్ట్‌మెంట్‌లో 6 టన్నుల సరుకు రవాణా ఏకకాలంలో జరుగుతుంది. మూడు డిజైన్లను రైల్వే బోర్డుకు సూచించినట్లు కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారి వెల్లడించారు.

ఈ మూడింటిలో ఒకదానికి ఆమోదముద్ర పడింది. ఒక బోగీ నిర్మాణానికి రూ.2.70 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుంది. పూర్తి ఏసీతో ఉంటాయి. ఒక్కో రైలుకు 20 బోగీలుంటాయి. సరుకులను, ప్రయాణికులను ఇవి ఏకకాలంలో తీసుకువెళ్లనున్నాయి. ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత కోచ్‌ల తయారీ ప్రారంభమవుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − one =