ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు నిలిపేసి, విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించాలి: పవన్

AP News, janasena chief, janasena chief pawan kalyan, pawan kalyan, Pawan Kalyan Appeals AP Govt to Rethink on Holding Exams for Engineering Students, Pawan Kalyan Holding Exams for Engineering Students, Pawan Kalyan Latest News, pawan kalyan news, Pawan Kalyan On Exams for Engineering, Rethink on Holding Exams for Engineering Students

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పరీక్షల విషయంలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, వారి తల్లితండ్రుల్లో నెలకొన్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పరిగణనలోకి తీసుకోవాలి. కరోనా మూలంగా మార్చి నెల నుంచి విద్యాసంస్థలు మూతపడ్డ క్రమంలో తమకు సెమిస్టర్ పరీక్షల సమాచారం కూడా సక్రమంగా ఇవ్వకుండా పరీక్షల షెడ్యూల్ ప్రకటించి ఏర్పాట్లు చేయడంపై విద్యార్ధులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో వేల కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో పరీక్షలకు వెళ్లాలంటే భయంగా ఉందని విద్యార్థులు, వారి తల్లితండ్రులు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

“ప్రతి సెమిస్టర్ లో ఎనిమిది పరీక్షలు ఉంటాయనీ, ప్రస్తుతం స్వస్థలాల్లో ఉన్న విద్యార్థులను మళ్ళీ కాలేజీలు ఉన్న ప్రాంతానికి ఎలా పంపించాలని కన్న వారు ఆవేదన చెందుతున్నారు. అలాగే సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులు ఏ మేరకు సన్నద్ధమై ఉన్నారో కూడా జెఎన్టియూ వర్గాలు కూడా సరిగా అంచనాకు రాలేదు. వారి ఆవేదనను సంబంధిత విశ్వవిద్యాలయాలకు చెబుతున్నా స్పందించకుండా పరీక్షల నిర్వహణకే ముందుకు వెళ్ళడం భావ్యం కాదు. మానసిక ఒత్తిడిలో ఉన్న విద్యార్ధుల గురించి ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి సానుకూలంగా ఆలోచించాలి. ఇతర రాష్ట్రాల విద్యాశాఖలు, ఎన్ఐటీలు సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో అనుసరించిన విధానాలను, యూజీసీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. సెమిస్టర్ పరీక్షల నిర్వహణను నిలుపుదల చేసి విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − eight =