రజినీకాంత్ రాజకీయప్రవేశంపై పవన్ కళ్యాణ్ స్పందన

Janasena Chief Pawan Kalyan Responds over Rajinikanth's Political Entry,Rajinikanth,Superstar Rajinikanth,Pawan Kalyan,Powerstar Pawan Kalyan,Actor Pawan Kalyan,Hero Pawan Kalyan,Actor Rajinikanth,Janasena,Mango News Telugu,Pawan Kalyan,Pawan Kalyan latest news,Rajinikanth,Pawan Kalyan press meet,Pawan kalyan latest speeches,Pawan Kalyan speech,Vijayawada,Rajinikanth Political Party,Janasena chief,ap news,Pawan Kalyan live,Janasena,janasena latest news,ap latest news,today's trending news,telugu news,ap latest updates,telugu breaking news,telugu live news,covid-19,today's news,Mango News

జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నానని, పార్టీకి సంబంధించిన వివరాలపై డిసెంబర్ 31 ప్రకటన చేయనున్నట్టు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజినీకాంత్ రాజకీయప్రవేశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం తిరుపతిలో పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ అంశంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో కొత్త వ్యక్తి రాజకీయాల్లోకి రావాలనుకుంటే మనస్పూర్తిగా ఆహ్వానించాలి. ఇవాళ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయాల్లో విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. చొక్కా నలగకుండా రాజకీయాలు ఎవరూ చేయలేరు. ఇబ్బందులు ఉంటాయి, కేసులు పెడతారు అన్ని తట్టుకొని నిలబడాలి” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =