ఎస్ఈసీ సర్క్యులర్ నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court Issued A Stay on SEC Circular,High Court of Telangana,High Court,Telangana,Telangana State,Telangana High Court,SEC Circular,High Court of Telangana Issued A Stay on SEC Circular,Telangana High Court Stay on SEC Circular,Mango News,Mango News Telugu,Telangana High Court on SEC Circular,High Court of Telangana Stay on SEC Circular,Telangana News,Telangana High Court Stay,Stay on SEC Circular,SEC,Telangana High Court suspends SEC Circular,Telangana HC suspends SEC Circular On Validating Ballot Papers,Hyderabad GHMC Polls

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రాత్రి కీలక సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్నవాటినే కాకుండా వేరే చిహ్నంతో (ఆయా పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంప్/పెన్నుతో టిక్ చేసి) ఓటు వేసిన కూడా చెల్లుబాటు ఓట్లుగానే పరిగణించాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ సమయంలో పలువురు ఎన్నికల అధికారులు ఓటర్లకు పొరపాటున స్వస్తిక్ గుర్తు కాకుండా వేరే చిహ్నాన్ని ఇచ్చినట్టు ఎస్ఈసీ దృష్టికి వచ్చారు. పోలింగ్ అధికారుల తప్పిందం నేపథ్యంలో ఓటువేసే వ్యక్తి యొక్క ఉద్దేశం ప్రకారం ప్రత్యేకంగా ఒక అభ్యర్థి గుర్తుపై మార్క్ చేస్తే దాన్ని చెల్లుబాటు అయ్యే ఓటు గానే పరిగణించాలని ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ సర్క్యులర్‌ ను సవాల్‌ చేస్తూ బీజేపీ పార్టీ హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి ఎస్ఈసి సర్క్యులర్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

స్వస్తిక్‌ గుర్తు ఉన్న ఓటును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక స్టాంపు, పెన్నుతో టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యేకంగా లెక్కించిన ఉన్న ఓట్లు కాకుండా మెజారిటీ ఎక్కువుగా ఉంటే ఆయా డివిజన్ లలో ఫలితాలు ప్రకటించవచ్చని కోర్టు వెల్లడించింది. వెంటనే కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని తెలంగాణ ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని కోరుతూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eleven =