ఏపీలో బ్లాక్‌ఫంగస్‌ వ్యాధికి చికిత్స అందించే ఆసుపత్రుల వివరాలు ఇవే…

List of Hospitals where Black Fungus Treatment Available in Andhra Pradesh State,Mango News,Mango News Telugu,State To Declare Black Fungus As Notified Disease,Black Fungus,Black Fungus Treatment,Black Fungus Treatment Available in AP,AP,AP News,Andhra Pradesh,Andhra Pradesh Black Fungus,Andhra Pradesh Allocated 1600 Vials Of Drug To Treat Black Fungus Cases,Black Fungus in Andhra Pradesh,Black Fungus in AP,Cases Of Black Fungus On The Rise In Andhra Pradesh,Black Fungus Treatment In AP,List of Hospitals,List of Hospitals Black Fungus Treatment,Black Fungus Treatment Hospitals,Black Fungus Treatment Hospitals In Andhra Pradesh

మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసుల చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులకు ప్రస్తుతం 17 ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆసుపత్రుల జాబితాను గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

బ్లాక్‌ఫంగస్‌ వ్యాధికి చికిత్స అందించే ఆసుపత్రుల జాబితా:

  1. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (జీజీహెచ్‌) అనంతపురం.
  2. ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, తిరుపతి.
  3. స్విమ్స్‌, తిరుపతి.
  4. జీజీహెచ్‌, కాకినాడ (రంగరాయ మెడికల్‌ కళాశాల)
  5. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (జీజీహెచ్‌) గుంటూరు.
  6. జీజీహెచ్‌ (రిమ్స్‌) కడప.
  7. జీజీహెచ్‌, విజయవాడ.
  8. గవర్నమెంట్ రీజినల్ ఐ హాస్పిటల్, కర్నూల్
  9. జీజీహెచ్‌, కర్నూల్.
  10. జీజీహెచ్‌ (రిమ్స్‌) ఒంగోలు,ప్రకాశం.
  11. జీజీహెచ్‌, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్‌ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నెల్లూరు).
  12. జీజీహెచ్‌, శ్రీకాకుళం (గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం).
  13. గవర్నమెంట్ ఈఎన్‌టీ హాస్పిటల్, విశాఖపట్నం.
  14. గవర్నమెంట్ రీజినల్ ఐ హాస్పిటల్, విశాఖపట్నం.
  15. గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ డిసీజెస్ (ఆంధ్రా మెడికల్ కాలేజ్).
  16. కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్‌) విశాఖపట్నం.
  17. విమ్స్‌, విశాఖపట్నం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + thirteen =