దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అంతర్జాతీయంగా అనేక అవార్డులు కొల్లగొడుతోంది. ఈ క్రమంలో తాజాగా సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల బరిలో నిలిచింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఈ మేరకు కాలిఫోర్నియా వేదికగా జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యాతలు రిజ్ అహ్మద్, అల్లిసన్ విలియమ్స్ 95వ ఆస్కార్ నామినేషన్ల (2023)ను ప్రకటించారు. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ ‘నాటు నాటు’ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు. అలాగే కాల భైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన కొరియోగ్రాఫీ అందించారు. కాగా ఈ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం.
ఈ నేపథ్యంలో నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ నామినేషన్‌ను అందుకున్న ఆర్ఆర్ఆర్ బృందానికి సినీపరిశ్రమ నుంచి పెద్దఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్నందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి, విజనరీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ప్రత్యేక అభినందనలు చెప్పారు. ఇంకా ఈ పాటుకు ఉత్తమ కొరియోగ్రఫీ రూపొందించిన డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్, గాయకులు కాల భైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్ తదితరులకు శుభాభినందనలు తెలిపారు. ఇక ప్రత్యేకంగా ఈ సినిమా హీరోలు జూ.ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు అభినందనలు తెలియజేశారు.
ONE STEP AWAY FROM THE PINNACLE OF CINEMATIC GLORY !!! 🎉🔥🎉👏👏
Heartiest Congrats on THE Oscar Nomination for Best Original Song @mmkeeravaani garu & the visionary @ssrajamouli and the Entire Team behind #NaatuNaatu & @RRRMovie
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 24, 2023
ఇక మరో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిలో.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌కు నామినేట్ కావడం గొప్ప ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఇది సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అలాగే దీనితో పాటు డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రెత్స్’ మరియు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయిన ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ చిత్ర బృందాలకు అభినందనలు అని పేర్కొన్నారు.
మరోవైపు సినీ పరిశ్రమ నుండే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఏ క్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. ప్రతిష్టాత్మక ఆస్కార్స్‌లో నాటు నాటు పాట నామినేషన్ సాధించినందుకు మొత్తం బృందానికి హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. మీరు గోల్డెన్ గ్లోబ్‌ను సాధించిన విధంగానే ఆస్కార్‌ని కూడా గెలుచుకు వస్తారని ఆశిస్తున్నాను, అని వెల్లడించారు.
Hearty congratulations to @mmkeeravaani, @ssrajamouli, @boselyricist, @tarak9999, @AlwaysRamCharan and the entire crew of @RRRMovie for the nomination of Naatu Naatu song at the Oscars.(1/2) pic.twitter.com/8w2QzwIHNt
— N Chandrababu Naidu (@ncbn) January 24, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE