తారకరత్న ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మెరుగవుతోంది, త్వరలోనే కోలుకుంటాడు – నందమూరి రామకృష్ణ

Nandamuri Ramakrishna Responds Over Taraka Ratna Health Condition After Visit Him at Bengaluru Hospital,Nandamuri Ramakrishna,Responds Over Taraka Ratna,Taraka Ratna Health Condition,Visit Him at Bengaluru Hospital,Mango News,Mango News Telugu,Taraka Ratna for Speedy Recovery,Nandamuri Taraka Ratna,Nandamuri Taraka Ratna Latest News and Updates,Nandamuri Taraka Ratna Health,Nandamuri Taraka Ratna Health Status,Nandamuri Taraka Ratna Latest Updates,Nandamuri Taraka Ratna Health Updates,Nandamuri Taraka Ratna Latest Updates,Yuvagalam Padayatra

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఆయన బాబాయి నందమూరి రామకృష్ణ తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నను ఐసీయూలో చూసి బయటికొచ్చిన అనంతరం తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మెరుగవుతోందని, మొన్నటి కన్నా, నిన్నటి కన్నా.. ఈరోజు బెటర్ అని చెప్పారు. ఆయన అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయని, న్యూరో రికవరీ కావడానికి మరికొంత సమయం పట్టొచ్చని వెల్లడించారు. తారకరత్న శరీరం చికిత్సకు స్పందిస్తోందని, ఆయన త్వరలోనే కోలుకుని మామూలు మనిషిలా బయటకు వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక బయట ప్రచారంలో ఉన్నట్లు తారకరత్నకు ఎక్మో పెట్టలేదని, వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని నందమూరి రామకృష్ణ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 5 =