తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహణ

Telangana Govt Says Budget Meetings Will be Conducted with Governor's Speech in Assembly,Governor's Speech in Assembly,Telangana Budget Meetings,Budget Meetings Telangana,Mango News,Mango News Telugu,Telangana Govt To Present Budget,Telangana Govt Budget,Telangana Budget 2023 On Feb 3 Or Feb 5,Telangana Budget 2023,Telangana Budget Wikipedia,Telangana Budget 2023 24,Telangana Budget 2023,Telangana Education Budget,Telangana Budget Date,Andhra Pradesh Budget,Telangana Budget 2022 Pdf,Telangana Budget 2023-24,Telangana Govt Budget 2020-21,Budget Of Telangana 2023,Structure Of Government Budget

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు విషయాన్ని హైకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. హైకోర్టు సూచనతో ప్రభుత్వ న్యాయవాది, గవర్నర్ తరపు న్యాయవాది చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2023-24 బడ్జెట్‌ను ఇంతవరకూ గవర్నర్ ఆమోదించలేదని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రావాలని ఇరు వర్గాల లాయర్లకు సూచించింది. ఈ నేపథ్యంలో చర్చలు జరిపిన ఇరువురు న్యాయవాదులు రాజ్యాంగ బద్దంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్ధమని కోర్టుకు తెలియజేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి సమ్మమేనని ప్రభుత్వ తరపు దుశ్యంత్ దవే తెలుపగా.. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి గవర్నర్ కూడా అంగీకరించనున్నట్లు రాజ్ భవన్ తరపు లాయర్ అశోక్ ఆనంద్ వెల్లడించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లు అయింది. కాగా శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 8 =