ఆ స్పెషల్ డే రోజే స్ట్రీమింగ్ కానున్నతలైవా బ్లాక్ బస్టర్

Rajinikanths Jailer Movie Likely to be Streaming in OTT on Ganesh Chaturthi,Rajinikanths Jailer Movie,Jailer Movie Likely to be Streaming,Streaming in OTT on Ganesh Chaturthi,Rajinikanths Jailer on Ganesh Chaturthi,Mango News,Mango News Telugu,Jailer movie in OTT, Jailer movie, OTT, Blockbuster movie, OTT streaming,Rajinikanths Jailer Latest News,Rajinikanths Jailer Latest Updates,Rajinikanths Jailer Live News,Jailer OTT Latest News,Jailer OTT Latest Updates,Jailer OTT Live News

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘జైలర్‌ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో.. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌ మెయిన్ రోల్స్ పోషించారు.

ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన తలైవా మూవీ..‌ ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు రూ. 600 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టిన జైలర్ మూవీ.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో తమిళ్‌ మూవీగా రికార్డులు రికార్డులు క్రియేట్ చేసింది. త్వరలోనే జైలర్ కంటే టాప్‌లో ఉన్న 2.ఓ ను కూడా ఈ సినిమా క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

కాసుల వర్షం కురిపిస్తోన్న ఈసమయంలోనే.. జైలర్‌ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకవడం కలకలం రేపుతోంది. నిన్నటి నుంచి చాలా పైరసీ సైట్లలో జైలర్ దర్శనమిస్తోంది. దీంతో మూవీ టీమ్‌తో పాటు, రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్నప్పుడు.. ఈ సినిమాను ఎవరూ పైరసీలో చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు మూవీ టీమ్ కూడా జైలర్‌ పైరసీ లింక్‌లను.. వివిధ సైట్లనుంచి తొలగించే ప్రయత్నం చేస్తోంది. అయితే జైలర్‌‌లోని కొనక్ని సన్నివేశాలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరోవైపు జైలర్‌ మూవీ థియేటర్లలో అడుగుపెట్టి 3 వారాలు దాటి పోయింది. అయితే ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్‌పై మూవీ టీమ్ ఎలాంటి అనౌన్స్ ‌మెంట్ చేయలేదు. అయితే ముందుగా సెప్టెంబర్ 7న ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముందని అంతా అనుకున్నాకూడా ఇప్పుడా పరిస్థితి కూడా కనిపించడం లేదు. ముందుగా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసేస్తే .. ఆ ఎఫెక్ట్ థియేటర్‌ కలెక్షన్లపై పడుతుందంటున్నారు మేకర్స్‌. ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాతే రజనీ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. దీనిని బట్టి వినాయక చవితికి జైలర్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here