అమ్మాయి చేతిలో చేయి వేసి త్వరలో శుభవార్త అంటూ ఫోటో

Vijay Deverakonda Shares Pic Hand-In-Hand Creates Storm in Social Media,Vijay Deverakonda Shares Pic Hand-In-Hand,Hand-In-Hand Creates Storm in Social Media,Vijay Deverakonda Creates Storm in Social Media,Mango News,Mango News Telugu,Vijay Devarakonda, Instagram post,viral Photo, good news soon,Vijay Devarakonda's, Instagram,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Latest Updates,Vijay Deverakonda Live News

హిట్టు, ఫ్లాపులు అనే సంబంధం లేకుండా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. త్వరలోనే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఖుషీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన అభిమానులను ఉత్సాహ పరుస్తున్నాడు. ఖుషి సినిమాపై భారీ అంచనాలు పెంచుతూ భారీ హిట్‌ను సొంతం చేసుకొనేందుకు సిద్దమయ్యాడు. సెప్టెంబర్ 1వ తేదీన మూవీ రిలీజ్ అవుతున్న సమయంలో ఖుషి లాంటి వార్తను సోషల్ మీడియాలో వెల్లడించారు.

విజయ్ దేవరకొండ అఫైర్ విషయాలు గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. యువ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉండటంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే విషయాన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండకు, సదరు హీరోయిన్‌తో పెళ్లి కూడా జరుగొచ్చనే ఊహాగానాలు మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి.

అయితే విజయ్ దేవరకొండ ఇటీవల రిలీజ్ చేసిన వీడియో సంచలనం రేపింది. సమంతకు అర్ధరాత్రి ఫోన్ చేసి పలకరించిన వీడియో వైరల్ అయింది. విజయ్ ఫోన్ చేయగానే.. అంతా ఒకేనా.. ఏమైనా ప్రాబ్లెం ఉందా అని సమంత అడిగితే.. నేను నిన్ను మిస్ అవుతున్నాను. నువ్వే నాకు గుర్తుకు వస్తున్నావు. నా రోజా నువ్వే. నా దిల్ సే నువ్వే.. నా అంజలి నువ్వే.. గీతాంజలి నువ్వే అంటూ పాట కూడా పాడటంతో అర్ధరాత్రి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందని అని మరో రూమర్‌కు బీజం పడింది.

విజయ్ దేవరకొండ చుట్టూ ఇలా రూమర్లు, గాసిప్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రౌడీ స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పెట్టి.. నా జీవితంలో చాలా జరుగుతున్నాయి. కానీ ఇది మాత్రం నాకు వాస్తవంగా చాలా స్పెషల్. త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాను అని ఓ మెసేజ్‌ను విజయ్ దేవరకొండ పోస్టు చేశారు. దాంతో అభిమానులు ఏదో పెళ్లి వార్త చెప్పబోతున్నాడనే జోష్‌లో రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ ట్రిక్కీగా పెట్టిన పోస్టు వెనుక అసలు కారణం.. ప్రముఖ వాచ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారట. ఆ విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించేందుకు ప్లాన్ చేశారు. తన అభిమానులు, ఫాలోవర్స్‌లో జోష్ పెంచేందుకు విజయ్ దేవరకొండ ఇలా పోస్టు పెట్టారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఖాతాలో ఎన్నో బ్రాండ్స్‌ ఉన్నాయి. ప్రముఖ కంపెనీలకు విజయ్ దేవరకొండ అంబాసిడర్‌గా ఉన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here