మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం

Several Politicians Mourns the Demise of AP IT, Industries Minister Goutham Reddy,Mekapati Goutham Reddy No More,Mekapati Goutham Reddy Passed Away,IT Minister Mekapati Goutham Reddy,Goutham Reddy Passed Away,Goutham Reddy Latest News,Rest In Peace Goutham Reddy,#RIPGouthamReddy,Goutham Reddy Demise,Mekapati Goutham Reddy,Mango News,Goutham Reddy Family,Minister Goutham Reddy,Goutham Reddy,Andhra minister Goutham Reddy ,Andhra Minister Mekapati Gautham Reddy, Andhra Pradesh IT Minister Mekapati Goutham, Andhra Pradesh minister Mekapati Goutham Reddy, AP Breaking News, AP Breaking News Today,Mango News,AP News,RIP Mekapati Goutham Reddy ,Mekapati Goutham Reddy Funeral

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి(50) కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడించారు. ఈ నేపథ్యంలో మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరం. వారు ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులు. గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. నేనంటే ఎంతో అభిమానం చూపేవారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్‌ రెడ్డి అని, మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనని అన్నారు. గౌతమ్‌ రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో సోమవారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం మరియు విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని గవర్నర్ అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి – తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

ఇంత చిన్న వయసులో మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం గురించి తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన కుటుంబ సభ్యులకు మరియు మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి – టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం గురించి తెలుసుకుని షాక్ అయ్యాను. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను – తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. వారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గౌతమ్ రెడ్డి విలక్షణమైన రాజకీయ నాయకుడు, విద్యావంతుడు, మృదుస్వభావి. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేస్తున్నాను. గౌతమ్ రెడ్డి పవిత్ర ఆత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని, పరమేశ్వరుని పార్థిస్తున్నాను – తులసి రెడ్డి

చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరం. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారు. గౌతమ్ రెడ్డి అధ్వర్యంలో రాష్ట్ర పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధించింది. మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గౌతమ్ రెడ్డి మరణం వైకాపాకు, రాష్ట్రానికి తీరని లోటు. – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 5 =