ఏప్రిల్ 1 నుంచి 5 వరకు విజయ కీలాద్రి దివ్యక్షేత్రముపై శ్రీలక్ష్మీ అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవములు

Sri Lakshmi Ammavari Thirunakshatra Mahotsavam at Vijayakeeladri Divya Kshetram from April 1st to 5th,Sri Lakshmi Ammavari Thirunakshatra Mahotsavam,Mahotsavam at Vijayakeeladri Divya Kshetram,Thirunakshatra Mahotsavam from April 1st to 5th,Mango News,Mango News Telugu,Vijayakeeladri Temple Visit,seethanagaram temple vijayawada,chinna jeeyar swamy today news,seethanagaram temple vijayawada timings,vijayakiladri,Vijayakeeladri Divya Kshetram Latest News,Vijayakeeladri Divya Kshetram Latest Updates

గుంటూరు జిల్లా సీతానగరములోని శ్రీమదుభయవేదాంతాచార్య పీఠంలో విజయ కీలాద్రి దివ్యక్షేత్రముపై ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అష్టలక్ష్మీ సహిత లక్ష్మీనారాయణుల సన్నిధిలో శ్రీలక్ష్మీ అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవములు జరగనున్నాయి. పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో ఈ మహోత్సవాలు జరగనున్నాయని తెలుపుతూ, భగవద్బంధువులందరికీ శుభాహ్వానము పలికారు. ఈ మహోత్సవాల్లో భాగంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటుగా విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై చిన జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం అమ్మ వార్లకు వివిధ వాహన సేవలు, అష్టోత్తర శతనామార్చన, నివేదన, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

విశేష కార్యక్రమములు వివరాలు:

 • డే 1 – ఏప్రిల్ 1, శనివారం: మహాలక్ష్మీ, వీరలక్ష్మీ అమ్మవార్లకు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు అభిషేకము, అలంకరణ, 10 గంటల నుండి 12 గంటల వరకు మల్లెపుష్పాలతో తొమ్మిది సన్నిధులలో 3 సార్లు సహస్రనామార్చన, విశేష ప్రసాద నివేదన, తీర్థప్రసాద గోష్ఠి.
 • డే 2 – ఏప్రిల్ 2, ఆదివారం: ధనలక్ష్మీ, సంతానలక్ష్మీ అమ్మవార్లకు 8 గంటల నుండి 10 గంటల వరకు అభిషేకము, అలంకరణ, 10 గంటల నుండి 12 గంటల వరకు గులాబి పుష్పాలతో తొమ్మిది సన్నిధులలో 3 సార్లు సహస్రనామార్చన, విశేష ప్రసాద నివేదన, తీర్థప్రసాద గోష్ఠి.
 • డే 3 – ఏప్రిల్ 3, సోమవారం: జయలక్ష్మీ, ధాన్యలక్ష్మీ అమ్మవార్లకు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు అభిషేకము, అలంకరణ, 10 గంటల నుండి 12 గంటల వరకు చామంతి పుష్పాలతో తొమ్మిది సన్నిధులలో 3 సార్లు సహస్రనామార్చన, విశేష ప్రసాద నివేదన, తీర్థప్రసాద గోష్ఠి.
 • డే 4 – ఏప్రిల్ 4, మంగళవారం: ధైర్యలక్ష్మీ, రాజ్యలక్ష్మీ అమ్మవార్లకు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు అభిషేకము, అలంకరణ, 10 గంటల నుండి 12 గంటల వరకు కనకాంబర పుష్పాలతో తొమ్మిది సన్నిధులలో 3 సార్లు సహస్రనామార్చన, విశేష ప్రసాద నివేదన, తీర్థప్రసాద గోష్ఠి.
 • డే 5 – ఏప్రిల్ 5, బుధవారం: లక్ష్మీనారాయణులకు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు అభిషేకము, అలంకరణ, శ్రీయాగం, 10 గంటల నుండి 12 గంటల వరకు తులసి దలములతో తొమ్మిది సన్నిధులలో 3 సార్లు సహస్రనామార్చన, విశేష ప్రసాద నివేదన, తీర్థప్రసాద గోష్ఠి. సాయంత్రం గద్యత్రయ అనుసంధానం కార్యక్రమం జరగనుంది.
కైంకర్యం వివరాలు:
 • 5 రోజుల యాజమాన్యం – 1,00,000/-
 • 1 రోజు యాజమాన్యం (ఒక అమ్మవారి దగ్గర) – 10,000/-
 • 1 రోజు ప్రసాద కైంకర్యం – 5,000/-
 • 1 రోజు వాహన కైంకర్యం – 3,000/-
 • 1 రోజు యజ్ఞ కైంకర్యం – 1,500/-
 • అష్టోత్తరశతనామ అర్చన – 100/-.

భక్తులు అకౌంట్ నెం.094894600000141, IFSC కోడ్ YESB0000948, VIJAYAKILADRI DIVYA KSHETRAM ఈ అకౌంట్ నెంబర్ కి కైంకర్యానికి పంపగలరని సూచించారు. మరింత సమాచారం కోసం [email protected]. [email protected] ఈమెయిల్స్ ద్వారా లేదా www.chinnajeeyar.org వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు. కాగా భక్తులకు వచ్చినటువంటి మెసేజు స్క్రీన్ షాట్ మరియు గోత్రం పేర్లను 6309609810, 6304513339, 9640020303 వంటి ఫోన్ నెంబర్లకు వాట్సప్ చేయగలరని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here