టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి – టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్

T Congress MP Komatireddy Venkat Reddy Demands CBI Enquiry Over TSPSC Paper Leakage Case,T Congress MP Komatireddy Venkat Reddy,MP Komatireddy Demands CBI Enquiry,Komatireddy Demands CBI Enquiry Over TSPSC Case,TSPSC Paper Leakage Case,Mango News,Mango News Telugu,Dharmapuri Arvind Demands CBI Enquiry,Hyderabad News,Telangana News,T Congress MP Komatireddy Latest News,TSPSC issue,TSPSC Latest News and Updates,TSPSC Live News,Telangana Latest News And Updates,TSPSC Paper Leak Case Latest Updates

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దీనిపై భువనగిరిలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని కోరారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత షాను కలిసి ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతామని తెలిపారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశమని, వారు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కోచింగ్ తీసుకుని పరీక్షలకు ప్రిపేర్ అయ్యారని వివరించారు. అయితే పేపర్ లీక్ కావడంతో పరీక్షలు నిలిచిపోయాయని, వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, దర్యాప్తు సిట్ తోకాకుండా సీబీఐతో చేయించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 10 =