టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్

Super Star Rajinikanth Meets TDP Chief Chandrababu Naidu in Hyderabad,Super Star Rajinikanth,TDP Chandrababu Naidu,Rajinikanth Meets Chandrababu Naidu,Mango News,Mango News Telugu,Rajinikanth Movie,Rajinikanth New Movie,Rajinikanth Real Name,Rajinikanth 150Th Movie,Rajinikanth Birthday,Super Star Rajinikanth,Super Star Rajinikanth Age,Super Star Rajinikanth New Movie,Super Star Rajinikanth Movie List,Super Star Rajinikanth Movies,Super Star Rajinikanth Next Movie,Super Star Rajinikanth Cast,Rajini Super Star Rajinikanth,Annamalai Super Star Rajinikanth,Padayappa Super Star Rajinikanth,Annatha Superstar Rajinikanth

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడుతో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన రజనీకాంత్ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరివురి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తాజా పరిణామాలు, రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. కాగా ఆదివారం జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కలిసిన ఒక్కరోజు వ్యవధిలోనే చంద్రబాబును సూపర్ స్టార్ రజనీకాంత్ కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇక దీనిపై టీడీపీ వర్గాలు స్పందిస్తూ.. చంద్రబాబు, రజనీకాంత్ తొలినుంచీ మంచి స్నేహితులు అని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనే అని స్పష్టం చేశాయి. అలాగే చంద్రబాబు నాయుడు కూడా దీనిని గురించి ట్విట్టర్ వేదికగా.. తన ఫ్రెండ్‌ రజనీకాంత్‌ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇంకా రజనీకాంత్‌ని శాలువాతో సత్కరిస్తున్న ఫొటోని షేర్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =