నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా.. శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్

TDP Chief Chandrababu and Nara Lokesh Extends Wishes To Nandamuri Balakrishna on His Birthday,TDP Chief Chandrababu Wishes To Nandamuri Balakrishna,Nara Lokesh Extends Wishes To Nandamuri Balakrishna,Nandamuri Balakrishna on His Birthday,Wishes To Nandamuri Balakrishna on His Birthday,Mango News,Mango News Telugu,Warm greetings to Nandamuri Balakrishna,Nandamuri Balakrishna,Nandamuri Balakrishna Birthday,Nandamuri Balakrishna Latest News,Nandamuri Balakrishna Latest Updates,TDP Chief Chandrababu Latest News,TDP Chief Chandrababu Latest updates

ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ బావ, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు అల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారు ట్విట్టర్ వేదికగా బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు తన ట్విట్టర్ లో ఇలా తెలిపారు.. ‘నటునిగా కళాసేవ.. ఎమ్మెల్యేగా ప్రజా సేవ.. ఆసుపత్రి నిర్వహణతో సమాజ సేవ చేస్తున్న మా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మీరు.. నిండు నూరేళ్లూ ఆనందంతో, ఆరోగ్యంతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. అలాగే నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో.. ‘మా ప్రియతమ బాల మావయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు! కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రియురాలిగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి’ అని ఒక పోస్ట్ పెట్టారు. కాగా బాలకృష్ణను అభిమానులందరూ ప్రేమగా బాలయ్య అని పిలుచుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే నందమూరి, నారా కుటుంబ సభ్యులు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + four =