ఏపీ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. రేపు విశాఖలో భారీ బహిరంగ సభకు హాజరు

Union Home Minister Amit Shah Will Visit AP To Attend Public Meeting in Visakhapatnam Tomorrow,Union Home Minister Amit Shah,Amit Shah Will Visit AP,Amit Shah To Attend Public Meeting,Amit Shah Will Visit Visakhapatnam Tomorrow,Mango News,Mango News Telugu,Amit Shahs public meeting in Vizag,Union Home Minister Amit Shah News,Amit Shah Latest News,Amit Shah Latest Updates,Amit Shah Live News,Amit Shah Public Meeting Latest News,Amit Shah Public Meeting Latest Updates,Amit Shah Public Meeting Live News,Visakhapatnam Live News

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన రేపు (ఆదివారం, జూన్ 11, 2023) విశాఖపట్నంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. కాగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆయన పాలనలో సాధించిన ప్రగతిని వివరిస్తూ నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు ఏపీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేళ్ల విజయాలపై ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. అయితే ఈరోజు చెన్నైలో అమిత్ షా పర్యటించనున్నారు. అనంతరం రాత్రికి విశాఖ చేరుకోనున్నట్లు సమాచారం. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fourteen =