కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థి ఫిక్స్ ..

TDP Chief Chandrababu Likely To Finalize NRI Ramu as Contest Against Kodali Nani in Gudivada in Coming Elections,TDP Chief Chandrababu Likely To Finalize NRI Ramu,Finalize NRI Ramu as Contest Against Kodali Nani,Kodali Nani in Gudivada in Coming Elections,TDP,TDP candidate fix on Kodali Nani, TDP candidate, Kodali Nani,NRI Venigandla Ramu,Achchennaidu,Ravi Venkateswara Rao,Gudivada TDP MLA candidate 2024,Kodali Nani News Today,NRI Ramu VS Kodali Nani Latest Updates,TDP Chief Chandrababu Latest News,TDP Chief Chandrababu Latest Updates,Kodali Nani in Gudivada Latest News

ఏపీలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ప్రతీ సీటు..ప్రతీ ఓటు కీలకమే. వై నాట్ 175 నినాదంతో సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 160 సీట్లలో గెలుపు ఖాయమంటూ టీడీపీ నాయకత్వం విశ్వాసంతో ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుడివాడ సీటు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అక్కడ ఎలాగైనా మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలనేది టీడీపీ లక్ష్యం. ఇందు కోసం అనేక తర్జన..భర్జనల తరువాత సర్వేల ఆధారంగా ఎట్టకేలకు అభ్యర్థిని డిసైడ్ చేశారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా తొలి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. అందులో గుడివాడ నియోజకవర్గంతో టీడీపీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 1983,1985 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విజయం సాధించారు. 2000లో జరిగిన ఉపఎన్నికలో రావి వేంకటేశ్వరరావు గెలుపొందారు. 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని.. 2014, 2019లో వైసీపీ నుంచి గెలుపొందారు. 2019లో కొడాలి నానిపై దేవినేని అవినాశ్‌ను చంద్రబాబు బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో 19,479 ఓట్ల మెజార్టీతో నాని గెలుపొందారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ హిట్ లిస్టు నియోజకవర్గాల్లో గుడివాడ తొలి స్థానంలో ఉంది. అక్కడ కొడాలి నానిపై బలమైన అభ్యర్థిని దించాలని చాలాకాలంగా చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారు. తాజాగా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పేరును టీడీపీ అధినేత ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నారై అయిన రాము నియోజకవర్గంలో చాలా రోజులుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. కొడాలి నానికి ధీటుగా కార్యక్రమాల నిర్వహణలో పార్టీ శ్రేణులను ఏకం చేస్తున్నారు. గుడివాడలోని సామాజిక సమీకరణాలు కూడా ఆయన విజయానికి కలిసి వస్తాయనే నమ్మకంతో టీడీపీ నాయకత్వం ఉంది. కొడాలి నానిని ఢీ కొట్టాలంటే అన్ని రకాలుగా బలమైన అభ్యర్థి కావాలని భావించిన టీడీపీ వెనిగళ్ల రాము పేరును డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో పోటీ చేసే దాదాపు 70 నియోజకవర్గాలకు చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. రిజర్వ్ నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం దిశగా ముఖ్య నేతలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా.. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే రావి వెంకటేశ్వరరావుతో రెండు దఫాలుగా అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రాముకు సీటు ఇస్తున్నట్లు చెబుతూ, రావిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 6 =