ఇక నుంచీ వాట్సాప్‌లో హార్ట్‌ సింబల్‌ పంపితే ఐదేళ్ల జైలు.. రూ.20 లక్షల జరిమానా

Saudi Arabia Warns of Fines and Jail For Sending Sending Heart Red Heart Emojis To Someone in WhatsApp,Saudi Arabia Warns of Fines,Saudi Arabia,Fines and Jail For Sending Sending Heart Emojis,Red Heart Emojis To Someone in WhatsApp,Warns of Fines Sending Heart Red Heart Emojis,Sending Heart Red Heart Emojis To Someone,Mango News,Mango News Telugu,5 Years Jail For Sending Heart Emoji, Saudi Arabia, Whats App Emoji, Whatsapp, Smart Phone, Mobile Users,Saudi Arabia Warns Latest News,Saudi Arabia Warns News Today,Saudi Arabia Warns Live Updates,Red Heart Emojis To Someone Latest News

ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్ ఏది టక్కున వాట్సాప్ అనేస్తాం. అంతగా యూజర్లను ఆకట్టుకుంటూ అందరినీ ఎడిక్ట్ చేసేసింది ఆ యాప్. ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారుకు చేరవ కావడంలో వాట్సాప్ ముందే ఉంటుంది. కేవలం వాట్సాప్ వాడటానికే స్మార్ట్ ఫోన్స్ కొనేవాళ్లు కూడా ఉన్నారంటే అది అతిశయోక్తి కూడా కాదు.

వాట్సాప్‌ను ఒక్క యూత్ మాత్రమే కాదు.. చాలా మంది టీనేజర్స్,వాళ్లతో పోటీ పడుతూ మిడిల్ ఏజ్ చివరకు వృద్ధులు కూడా ఈ యాప్‌ను చకచకా వాడేస్తున్నారు. అయితే ఎప్పుడు కొత్త కొత్త అప్ డేట్ లు ఇచ్చే వాట్సాప్‌లో కావాల్సినన్ని, సెర్చ్‌లో కూడా కావాల్సినవి పొందేటన్ని ఎమోజీలను కొన్నేళ్ల క్రితమే యాడ్ చేసింది వాట్సాప్. దీంతో తాము అక్షరాలలో చెప్పాలనుకున్న మాటలను.. ఎంచక్కా ఎమోజీలతోనే చెప్పడం అలవాటు చేసుకున్నారు యూజర్లు. ప్రేమ, కోపం, ఆకలి,నిద్ర, సంతోషం, బాధ ఒకటేమిటి ఇలా ఎన్నో ఫీలింగ్స్‌ను ఈ ఎమోజీలతోనే చెప్పేవారు. వీరికి తగ్గట్లుగానే వాట్సాప్ కూడా లేటెస్ట్ ఎమోజీలను పరిచయం చేస్తూ యూజర్ల మననసు మరింత దోచుకుంటోంది. కానీ ఇకపై ఎప్పటిలాగే అడ్డదిడ్డంగా ఎమోజీలు వాడేస్తే మాత్రం జైలుకి వెళ్లాల్సి వస్తుందట.

నిజానికి ఇప్పుడంతా వాట్సాప్‌ వాడనిదే పొద్దున్న మంచం కూడా దిగని రోజులకు వెళ్లిపోయారు. చివరకు స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇన్విటేషన్ పంపాలన్నా కూడా వాట్సాప్‌నే ఆశ్రయిస్తు్ననారు. ఇలా ప్రతిరోజూ కాలక్షేపం కోసం, అవసరం కోసం, ఏదైనా ముఖ్య విషయాన్ని చెప్పాలన్నా వాట్సాప్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక ప్రేమలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల సంగతి గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి టెక్స్ట్ మెసేజుల కంటే ఎమోజీలతోనే కాలం గడపేసి ప్రేమ లోకంలో విహరిస్తుంటారు. మెయిన్‌గా హార్ట్‌ ఎమోజీలతో ఇంప్రెస్‌ చేసేస్తుంటారు. అయితే ఇకపై ఇలా ఇష్టం వచ్చినట్లు హార్ట్‌ సింబల్స్‌ పంపిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సౌదీ అరేబియా నిర్ణయించుకుంది.

ఇక నుంచి వాట్సాప్‌లో రెడ్‌ హార్ట్‌ ఎమోజీని వాడితే.. అది వేధింపులతో సమానంగా భావిస్తామని సౌదీ అరేబియా రీసెంట్‌గా కఠిన నిర్ణయం తీసుకుంది. హార్ట్‌ సింబల్‌ పంపినవారికి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు.. రూ.20 లక్షల జరిమానా విధించనున్నట్లు సౌదీ ప్రకటించింది. ముఖ్యంగా అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా.. వారి వాట్సాప్‌కి రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అంతేకాదు ఒకవేళ వాళ్లు.. మళ్లీ హార్ట్ ఎమోజీ పంపితే మాత్రంవ వారికి రూ. 60 లక్షల జరిమానాతోపాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని సౌదీ అరేబియా అధికారకంగా ప్రకటించింది. ఇప్పటికే కఠినమైన ఆంక్షలు, కండిషన్లు అమలయ్యే సౌదీ అరేబియాలో ఈ సారి ఇలాంటి కొత్త రూల్‌ను తెచ్చి పెట్టిందని అక్కడి వారు వాపోతున్నారు. అయితే సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించడంతో పాటు.. తెలియని వ్యక్తులతో చాటింగ్‌లు చేస్తూ.. అనవసరమైన చిక్కుల్లో పడటం వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + three =