టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి కూల్చివేతపై హైకోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి – చంద్రబాబు

TDP Chief Chandrababu Slams YCP Govt Over High Court Comments on Demolition of Ex MLA Ayyanna Patrudu House, TDP Chief Chandrababu Slams YCP Govt, High Court Comments on Demolition of Ex MLA Ayyanna Patrudu House, Demolition of Ex MLA Ayyanna Patrudu House, Former MLA Ayyanna Patrudu House, Ex MLA Ayyanna Patrudu House, Ayyanna Patrudu House, TDP President Chandrababu Naidu, TDP Chief Chandrababu Naidu, Nara Chandrababu Naidu, Chandrababu Naidu, High Court Comments, YCP Govt, Demolition of Ex MLA Ayyanna Patrudu House News, Demolition of Ex MLA Ayyanna Patrudu House Latest News, Demolition of Ex MLA Ayyanna Patrudu House Latest Updates, Demolition of Ex MLA Ayyanna Patrudu House Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మరోసారి రాజకీయం వేడెక్కింది. దీనికి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చివేత కారణమయింది. అర్ధరాత్రి కూల్చివేతలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ విషయంలో తప్పు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనిపై శాంతియుతంగా నిరసన తెలపడానికై ‘చలో నర్సీపట్నం’ కార్యక్రమాన్ని పార్టీ తలపెట్టిందని, అయితే ఇందులో పాల్గొనడానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం ఏంటని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీకి చెందిన బీసీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే వారిని వేధింపులకు గురిచేస్తూ భయపెట్టాలని చూస్తోందని, తమ మాట వినని వారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అధికార బాలతో కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఇది సమర్ధనీయం కాదని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =