ప్రధాని మోదీ హైదరాబాద్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ.. ఏర్పాట్లను పరిశీలిస్తున్న బండి సంజయ్

Telangana BJP Chief Bandi Sanjay To Sets Huge Arrangements For The Party National Working Committee Meetings, BJP Chief Bandi Sanjay To Sets Huge Arrangements For The Party National Working Committee Meetings, Bandi Sanjay Kumar To Sets Huge Arrangements For The Party National Working Committee Meetings, Huge Arrangements For The Party National Working Committee Meetings, Party National Working Committee Meetings, Bandi Sanjay To Sets Huge Arrangements For The Party National Working Committee Meetings, BJP MLA Bandi Sanjay To Sets Huge Arrangements For The Party National Working Committee Meetings, BJP MLA Bandi Sanjay Kumar, Bandi Sanjay Kumar, Telangana BJP Chief Bandi Sanjay, Bandi Sanjay, Telangana BJP MLA, BJP MLA, Party National Working Committee Meetings News, Party National Working Committee Meetings Latest News, Party National Working Committee Meetings Latest Updates, Party National Working Committee Meetings Live Updates, Mango News, Mango News Telugu,

జులై 2, 3 తేదీల్లో ఇక్కడ జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సమావేశాల ఏర్పాట్లను బండి సంజయ్ స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమవారం ఉదయం పరిశీలించారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు. ఈ సభను జయప్రదం చేయటానికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రధాని పాల్గొనే సభను గురించి తెలియజేయాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలో దాదాపు 50 లక్షల ఆహ్వాన పత్రికలను ప్రజలకు పంచటానికి సిద్ధం చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 వేల మంది వరకు ఈ సభకు హాజరయ్యేలా చూడటానికి ప్రత్యేకంగా కార్యకర్తలను నియమిస్తున్నారు. లాజిస్టిక్స్, ఫుడ్, మీడియా వంటి ముఖ్య అంశాలపై ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పొరపాట్లకు ఆస్కారం లేకుండా పార్టీ నేతలు ఒకరికొకరు సహకరించుకోవాలని ఈ సందర్భంగా బండి సంజయ్‌ నేతలకు సూచించారు. ఇది పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సమావేశమని, తెలంగాణను ఒక లక్ష్యంతోనే ఎంపిక చేశామని నేతలకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించాలని వ్యూహాత్మకంగా నిర్ణయించింది. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సంజయ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెడ్పీ నడ్డా, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, ఇతర జాతీయ స్థాయి నాయకులు, సుమారు 350మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరందరికీ నగరంలోని ప్రముఖ నోవాటెల్ హోటల్ లో విడిది ఏర్పాటు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + fourteen =