విజయనగరం జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

TDP National President Chandrababu will Visit Vizianagaram District for 3 Days From Today,Chandrababu's visit to Vizianagaram,Vizianagaram 3 Days Visit,Chandrababu Vizianagaram Visit,Mango News,Mango News Telugu,Ap State News,Andhra Problem,Regional News Today,Ap Govt News,Situation In Ap,Andhra Pradesh News Live,Chandrababu Naidu Today Live,Chandrababu Kuppam Tour,Chandrababu Vizainagaram Tour,Chandrababu Videos,Chandrababu Village,Chandrababu Vizianagaram Tour Latest News,Vizianagaram Tour News and Live Updates

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి (డిసెంబర్ 22, గురువారం) నుంచి మూడు రోజుల పాటుగా విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం రాజాం, డిసెంబర్ 23-శుక్రవారం నాడు బొబ్బిలి, డిసెంబర్ 24-శనివారం నాడు విజయనగరం నియోజకవర్గాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లాలో బైక్ ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంకు చేరుకోనున్నారు.

డిసెంబర్ 22-గురువారం:

  • గురువారం సాయంత్రం పొగిరి వద్ద చంద్రబాబుకు పార్టీ శ్రేణుల స్వాగతం
  • వీఆర్‌ అగ్రహారం కూడలి నుంచి రాజాం వరకు బైక్‌ర్యాలీ నిర్వహణ
  • సాయంత్రం 5.30 గంటలకు శ్రీచైతన్య కళాశాల మీదుగా రాజాంలోని ప్రధానమార్గంలో రోడ్‌షో
  • రాజాంలోని మోర్ సూపర్ మార్కెట్ ప్రాంతంలో బహిరంగ సభ
  • రాత్రి 7.45 గంటలకు రాజాం ఆర్‌సీఎం చర్చిలో సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు
  • అనంతరం తృప్తి రిసార్ట్స్‌కు చేరుకుని రాత్రి బస.

డిసెంబర్ 23-శుక్రవారం:

  • శుక్రవారం ఉదయం 11 గంటలకు తృప్తి రిసార్ట్స్‌లో ఓబీసీ నాయకులతో చంద్రబాబు సమావేశం అవుతారు.
  • అనంతరం బొబ్బిలి పర్యటన, మధ్యాహ్నం 2 గంటలకు పెరుమాళికి చేరుకుంటారు.
  • పెరుమాళి నుంచి బొబ్బిలి మండలం గొల్లపల్లి వరకు బైక్‌ర్యాలీ నిర్వహణ
  • సాయంత్రం 5.30 గంటలకు బొబ్బిలి చర్చి సెంటర్ నుంచి రోడ్​షో
  • అనంతరం బొబ్బిలి కళాభారతి వాటర్ ట్యాంకు వద్ద బహిరంగ సభ
  • శుక్రవారం రాత్రి బొబ్బిలి ప్యాలెస్ లో బస

డిసెంబర్ 24-శనివారం:

  • శనివారం ఉదయం 11 గంటలకు బొబ్బిలి కోటలోని దర్బార్‌మహల్‌లో రైతులతో చంద్రబాబు సమావేశం
  • అనంతరం విజయనగరం పర్యటన, సాయంత్రం 4.30 గంటలకు ద్వారపూడి జంక్షన్‌ వద్ద చంద్రబాబుకు పార్టీ శ్రేణుల స్వాగతం పలుకుతారు.
  • విజయనగరంలోని వెంకటలక్ష్మి థియేటర్‌ ప్రాంతం నుంచి విజయనగరం కోట వరకు రోడ్‌షో
  • కోట జంక్షన్‌ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగం
  • అనంతరం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్‌ కు వెళ్లనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =