ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘బర్త్ డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్’ అంటూ చంద్రబాబు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పగా.. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. కాగా సీఎం జగన్ నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇక మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో స్థానికంగా పెద్ద ఎత్తున ప్రత్యేక రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.
Birthday greetings to @ysjagan.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2022
శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/7ZEtLyrwyS
— JanaSena Party (@JanaSenaParty) December 21, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ