ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉంది. మే 25, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2671 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 10,240 సాంపిల్స్ ని పరీక్షించగా 44 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అలాగే ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 56 కి చేరింది. మరోవైపు 1848 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లోనే 41 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 767 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 153 (మహారాష్ట్ర 101, గుజరాత్ 26, రాజస్థాన్ 11, ఒడిశా 10, తమిళనాడు 3, పశ్చిమ బెంగాల్ 1, కర్ణాటక 1) మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 117 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరోవైపు విదేశాల నుండి వచ్చిన వారిలో 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. గత 24 గంటల్లోనే 45 కొత్త కేసులు నమోదు కాగా, వారిలో కువైట్ నుండి వచ్చిన వారు 41, ఖతార్ నుండి 3 మరియు సౌదీ అరేబియా నుండి ఒక్కరు ఉన్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో మే 24, ఆదివారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1854 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 23 మందికి, వలస వచ్చిన వారిలో 11 మందికి, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఆరుగురికి, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసుతో కలిపి మొత్తం 41 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 53 కి చేరింది. అలాగే కొత్తగా 24 మందితో కలిపి ఈ వైరస్ నుంచి కోలుకుని 1092 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 709 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2671 పాజిటివ్ కేసు లకు గాను 1848 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 767. #APFightsCorona
— ArogyaAndhra (@ArogyaAndhra) May 25, 2020
Media bulletin
Date: May 24, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/ngzxcB3eJU
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 24, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu