రామ్‌చరణ్‌ గారాలపట్టికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రత్యేక బహుమతి

Tollywood Actor Junior NTR Sends Special Gift For Hero Ram Charan-Upasanas Recently Born Baby Girl,Tollywood Actor Junior NTR Sends Special Gift,Junior NTR Sends Special Gift For Hero Ram Charan,Special Gift For Ram Charan Recently Born Baby,Ram Charan Upasanas Recently Born Baby Girl,Mango News,Mango News Telugu,Junior NTR special gift,Junior NTR special gift for Ram Charan Daughter,Ram Charan Daughter, Ram Charan and Upasana Daughter,Jr NTRs expensive gold gift,Jr NTR send a special gift to Ram Charan,Jr Ntr Sends Amazing Gift to Ram Charans Daughter

చిరంజీవి ఫ్యామిలీకి జూన్ నెల ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి ఇంట మెగా ప్రిన్సెస్ క్లీన్ కార సందడి చేస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన ఒక బిడ్డకు జన్మనిచ్చారు. 11 సంవత్సరాల తరువాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, మెగా అభిమానులు సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా, తమ ప్రేమను వ్యక్తం చేయడానికి సెలబ్రిటీల అంతా అద్భుతమైన బహుమానాలను పంపుతున్నారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్.. రామ్‌చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లీన్ కారకు ఒక అద్భుతమైన బహుమానాన్ని పంపినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ మధ్య ఒక అద్భుతమైన స్నేహబంధం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ స్నేహబంధం మరింత పెరిగింది. వీరిద్దరూ ఏ వేదిక మీద ఉన్నా వీరి స్నేహాన్ని తెలియజేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరు ఇరువురి మధ్యనే కాకుండా ఇరు కుటుంబాల మధ్య కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్.. రామ్‌చరణ్‌ గారాలపట్టి క్లీన్ కారకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారని తెలుస్తోంది. క్లీన్ కార కోసం రామ్ చరణ్, ఉపాసన, క్లీన్ కార ముగ్గురు పేర్లతో ఉన్న బంగారు డాలర్స్‌ను డిజైన్ చేసి బహుమతిగా పంపారని సమాచారం. అయితే ఈ బహుమానాన్ని కూడా తారక్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ రామ్‌.. క్లిన్ కారాకు ఎంతో ఇష్టంగా అందించినట్టు తెలుస్తోంది. క్లీన్ కార పుట్టినప్పటి నుంచి ఫ్యాన్స్ మెగా ప్రిన్సెస్ విషయంలో తమ సంతోషాన్ని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త కూడా వైరల్ అవుతోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియనప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న మంచి స్నేహబంధం ఉందన్న విషయం తెలిసిందే కాబట్టి.. ఇది నిజమే అయి ఉండొచ్చని అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 16 =