పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కోసం కామన్ మొబిలిటీ కార్డ్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt To Introduce Common Mobility Card For Public Transport Soon,Telangana Govt To Introduce Common Mobility Card,Govt To Introduce Common Mobility Card,Common Mobility Card For Public Transport Soon,Card For Public Transport Soon,Mango News,Mango News Telugu,In the public transport system,Common Mobility Card,Public transport system,Towards National Common Mobility,Telangana government to roll out,Towards National Common Mobility,Telangana Latest News And Updates,Hyderabad News,Telangana News,Common Mobility Card Latest News,Common Mobility Card Latest Updates,Telangana Public Transport News Today,Telangana Public Transport Latest News

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు తెచ్చే కామన్ మొబిలిటీ కార్డును తీసుకురాబోతోంది. ఈ కార్డుతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో ఉన్న వివిధ సౌకర్యాలను వినియోగించుకునే వీలుంటుంది. కేసీఆర్ సర్కార్ ముందుగా ఈ కార్డును హైదరాబాద్ సిటీలో జారీ చేయనుంది.

హైదరాబాద్‌లోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ మొత్తానికి కలిపి ఉపయోగపడేలా ఒక కామన్ మొబిలిటీ కార్డుని తీసుకువచ్చే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ సంస్ధలు ఈ పనులు ప్రారంభించేశాయి కూడా. ప్రస్తుతం హైదరాబాద్‌లో మెయిన్ ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణించేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకోవడానికి వీలుండేలా ఈ కామన్ మొబిలిటీ కార్డు ఉండనుంది. ఈ కార్డ్‌తో, ఆర్టీసీ బస్సులు, మెట్రో ట్రైన్, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, ఆటోలతో సహా ప్రజా రవాణా వ్యవస్థలోని వివిధ సౌకర్యాలకు ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాక్సెస్ పొందొచ్చు.

సచివాలయంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థల ఉన్నతాధికారులు రాబోయే కార్డు వివరాలను అందించారు.రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులతో పాటు గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలిదశలో హైదరాబాద్‌లోని ప్రాథమిక ప్రజా రవాణా మార్గాలైన మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల కోసం కామన్ మొబిలిటీ కార్డును ప్రయాణికులు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో సాధారణ మొబిలిటీ కార్డ్ సేవలు ఎంఎంటీఎస్, క్యాబ్ సర్వీసులు, ఆటోలను కూడా చేర్చడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. భవిష్యత్తులో ఇతర కార్డుల మాదిరిగానే డిఫరెంట్ టైప్స్ ఆప్ పర్చేజెస్‌కు ఈ కార్డును ఉపయోగించడానికి వీలుగా “అన్ని అవసరాలకు ఒకే కార్డు” మోడల్‌ను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

దీంతో ఆగస్టు రెండో వారంలోగా హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా కామన్ మొబిలిటీ కార్డుల జారీకి శ్రీకారం చుట్టాలని.. మంత్రులు అధికారులను ఆదేశించారు. అంతేకాదు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌కు.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాక్సెస్‌ను అందించడం ద్వారా.. హైదరాబాద్ సిటీతో పాటు.. తెలంగాణ అంతటా ఈ కార్డ్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం అనుకుంటోంది. సాధారణ మొబిలిటీ కార్డుతో,ఇతర మెట్రో నగరాల్లో కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఈజీగా వాడుకోవచ్చు. దీని వల్ల నగరవాసులకు తమ జర్నీ మరింత ఈజీ అవడమే కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఇబ్బందులు పడకుండా ఉంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ గవర్నమెంట్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 4 =