చంద్రుడి దక్షిణ ధృవంపై భారీగా రసాయనాలు, ఖనిజ నిల్వలు

Chandrayaan 3s Pragyan Discovers Sulphur Oxygen on Moons South Polar Region,Chandrayaan 3s Pragyan Discovers,Sulphur Oxygen on Moons South Polar Region,Pragyan Discovers Sulphur Oxygen,Mango News,Mango News Telugu,Sulphur Oxygen on Moon News Today,The Pragyan rover, which started the original work, chemical and mineral deposits,the south pole of the moon,Chandrayaan 3 Latest News,Chandrayaan 3 Latest Updates,Chandrayaan 3 Live News

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది. ఇక రోవర్‌ ద్వార చంద్రుడి మీదికి పంపించిన పేలోడ్స్ అన్నీ కూడా సక్రమంగా పని చేస్తున్నాయి. పేలోడ్స్ అన్నీ స్విచ్ ఆన్ అయ్యాయి. వాటి ద్వారా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలానికి సంబంధించిన పూర్తి సమాచారం, డేటా బెంగళూరులోని ఇస్రో కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కు అందడం ఆరంభమైంది.

రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్స్ ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్‌ ఇయానోస్ఫియర్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్.. వంటి పరికరాలు తమ పని మొదలుపెట్టాయి. డేటాను సేకరిస్తోన్నాయి. ఈ పేలోడ్స్‌లల్లో ఒకటైన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ.. కీలక సమాచారాన్ని సేకరించింది. చందమామ దక్షిణ ధృవంపై రసాయన, ఖనిజ నిల్వలు భారీగా ఉన్నట్లు గుర్తించింది. ప్రత్యేకించి సల్ఫర్ నిల్వలు భారీగా ఉన్నట్లు నిర్ధారించింది. దీనికి సంబంధించిన పూర్తి డేటాను ఇస్రోకు పంపించింది.

సల్ఫర్‌తోపాటు అల్యూమినియం, క్యాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం నిల్వలు ఉన్నాయని లిబ్స్ పేలోడ్ గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. అత్యధిక శక్తి గల లేజర్ కిరణాలను లిబ్స్ ప్రసారం చేయగలదు. చంద్ర శిలలు, లేదా మట్టి లక్షణాలను తెలుసుకోవడానికి లిబ్స్‌ను వినియోగిస్తోంది ఇస్రో. ఈ లేజర్ కిరణాలను ప్రసారం చేయడం ద్వారా శిలలు లేదా మట్టి లక్షణాలను గుర్తించడానికి సాధ్యపడుతుంది. ఈ లేజర్‌లో ఉన్న ప్లాస్మా ద్వారా అందులో మిళితం అయిన రసాయనిక ధాతువులను దీని ద్వారా గుర్తించవచ్చు. లేజర్ ద్వారా ప్రసారం అయ్యే కాంతి ఆయా ధాతువుల లక్షణాలను గుర్తించగలుగుతుంది.

ఆ ధాతువు లేదా మూలకాల కోసం కేటాయించిన రంగుల్లో వాటి లక్షణాలను ఆవిష్కృతం చేస్తుంది. ఆ రంగుల మిశ్రమాల ద్వారా ఆయా ధాతువులను ఇస్రో గుర్తించింది. చంద్రుడి ఉపరితలంపై గల రాళ్లు, మట్టిలో కలిసి ఉన్న రసాయనిక ధాతువులు, మూలకాలను గుర్తించడానికి లిబ్స్‌ను పేలోడ్‌గా పంపించింది ఇస్రో. దీన్ని బెంగళూరులోని ఎలెక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − ten =