వచ్చేది మా ప్రభుత్వమే.. తొలి ఆరు నెలలు నేనే హోంమంత్రిని – వైసీపీ నేత అంబటి రాంబాబు

YSRCP Leader Ambati Rambabu Says, I Will Be Home Minister For First 6 Months After We Come to Power

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం రంజుగా సాగుతున్న వేళ రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా గుంటూరులో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

“రాష్ట్రంలో 2029లో అధికారంలోకి వచ్చేది మేమే.. మా ప్రభుత్వంలో మొదటి ఆరు నెలలు నేనే హోంమంత్రిని” అంటూ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు అక్కడ నవ్వులు పూయించడంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

గుంటూరులోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం నుంచి నామినేషన్ వేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు అంబటి రాంబాబు భారీ ర్యాలీగా బయలుదేరారు. అయితే ఆర్వో కార్యాలయానికి సమీపంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి వైకాపా నాయకులను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై స్పందిస్తూ.. అక్కడున్న పోలీసులంతా మంచివారేనని, కానీ ఒక్కరు మాత్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ విధుల్లో ఉన్న పట్టాభిపురం సీఐని ఉద్దేశించి రాంబాబు కామెంట్స్ చేశారు. ఎన్నికల వేళ పోలీసుల వ్యవహారశైలి, అధికార కూటమి నేతల తీరుపై వైకాపా నేతలు ఈ సందర్భంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here