వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. వైఎస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్, కవర్ ఫిక్ ను, బయోడేటా మార్చేయడంతో పాటుగా, ఆ ట్విట్టర్ హ్యాండిల్లో హ్యాకర్లు వివిధ రకాల పోస్ట్‌లను పెడుతున్నారు. మొత్తం క్రిప్టో కరెన్సీ సంబంధిత పోస్టులు పెడుతూ, వాటిని రీట్వీట్స్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ అకౌంట్ హ్యాక్ అయినట్టుగా వైఎస్సార్సీపీ టెక్నికల్ టీమ్ గుర్తించింది. త్వరలోనే ఈ అకౌంట్‌ని పునరుద్దరణ చేయడానికి పార్టీ టీమ్ ప్రయత్నిస్తోందని తెలిపారు. హ్యాకింగ్ పై ట్విట్టర్ యాజమాన్యానికి వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఫిర్యాదు చేసి, పునరుద్దరణ చేసేందుకు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE