దేశంలో కొత్తగా 126 కరోనా కేసులు నమోదు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే?

126 New Corona Cases 113 Recoveries Reported in India in the Last 24 Hours,126 New Corona Cases,113 Recoveries Reported,India in the Last 24 Hours,Mango News,Mango News Telugu,Covid Deaths,Covid Last 24 Hours, 126 People Tested Positive,Coronavirus In India,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోకి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 16, గురువారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,84,502 కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. మరోవైపు కరోనా వలన మరో మరణం (కర్ణాటకలో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,757కి పెరిగింది.

అలాగే మరో 113 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,51,910 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య ప్రస్తుతం 1,835కి చేరింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,15,409 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.11 శాతంగా నమోదైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =